
న్యూఢిల్లీ: స్టార్‌లింక్ ఆఫర్ చేయనున్న బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ల వలన జియో, ఎయిర్‌టెల్‌కు పెద్దగా నష్టం ఉండదని జేఎం ఫైనాన్షియల్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ టెలికం కంపెనీలు తక్కువ ధరల్లో, అన్‌లిమిటెడ్ డేటాతో హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌లను అందిస్తున్నాయని తెలిపింది. టెలికం కంపెనీలతో స్టార్‌లింక్ కలిసి పనిచేయగలుగుతుందని, మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సర్వీస్‌లను అందించగలుగుతుందని వివరించింది.
స్టార్‌లింక్, ఇతర శాట్‌కామ్ కంపెనీలు నెలకు రూ.870 నుంచి రూ.43 వేల ప్రైస్ రేంజ్‌లో సర్వీస్‌లను అందిస్తున్నాయి. హార్డ్‌వేర్ సెట్ కోసం ఒకసారి రూ.22 వేల నుంచి రూ.33 వేల రేంజ్‌లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఇండియన్ కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌లను నెలకు రూ.450 నుంచి రూ.600 రేంజ్‌లోనే అందిస్తున్నాయి.
ప్రీమియం సర్వీస్‌ల కాస్ట్ రూ.4,000 మించడం లేదు. స్టార్‌లింక్ డేటాపై లిమిట్ పెడుతుండగా, జియో, ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి.