భవిష్యత్తులో ఖమ్మంకు వరద ముప్పు ఉండొద్దు: మంత్రి తుమ్మల

భవిష్యత్తులో ఖమ్మంకు వరద ముప్పు ఉండొద్దు: మంత్రి తుమ్మల

ఖమ్మం: సీఎం రేవంత్​రెడ్డి చొరవతో ఖమ్మంను అన్ని విధాలుగా డెవలప్​చేసి ఇతర పట్టణాలనకు ఆదర్శంగా ఉండేలా  తీర్చిదిద్దుతామని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.  ఇవాళ ఖమ్మం కార్పొరేషన్ 46వ డివిజన్‎లో  రూ.కోటి తో నిర్మించనున్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు. గతంలో తాను మంత్రిగా ఉన్నకాలంలో నగరానికి కోట్లది రూపాయాలు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని అన్నారు. రాబోయే కాలంలో అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ‘మున్నేరు వరద, చెరువుల నుంచి వచ్చే వరద పట్టణాన్ని ముంచే పరిస్థితి మరోసారి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి డిజైన్ చేసేందుకు నిపుణుల కమిటీని నియమించమని సీఎంను కోరాం.  

ALSO READ | గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు : తుమ్మల నాగేశ్వర రావు

డ్రైనేజీ కాలువల డిజైన్ సైతం పక్కాగా ఉండాలని, కాల్వల  నిర్మాణం చివరి వరకు వెళ్లే విధంగా చూడాలని, వీటి నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావద్దని ఇంజనీర్లను ఆదేశిస్తున్న.  నాలాలఆక్రమణలను తొలగించే సమయంలో అంతా మానవతా దృక్పథంతో ఉండాలి.  ఆక్రమణలలో ఉన్న పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు మరో చోట అందించి, వారిని తరలించిన తర్వాత ఆక్రమణలను తొలగిస్తం. ఆక్రమణలు తొలగించిన తర్వాతనే నిర్మాణ పనులు స్టార్​చేయాలి. ఖమ్మంలో వరద నివారణ చర్యలకు ప్రభుత్వం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తుంది.  ప్రభుత్వం అన్ని వర్గాల వారు ఒకే చోట చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్​స్కూల్స్​నిర్మిస్తుంది’ అని మంత్రి తుమ్మల అన్నారు. 

 మసీదుల నిర్వహణకు రూ. 63 లక్షల చెక్కులు అందజేత  

ఖమ్మం టౌన్‎లో​మసీద్‎ల నిర్వహణ కోసం రూ.లక్ష చొప్పన రూ.63 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అందించారు.  వచ్చే ఏడాది నుంచి ఈ నిధులు రంజాన్​ పండుగకు మందుగానే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ఈ సారి వరదలు పార్లమెంట్​ఎన్నికలు రావడంతో లేట్​అయిందని చెప్పారు.  ఎన్నికల టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఖమ్మంకి అన్ని వైపులా ఖబరస్థాన్​ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఖమ్మంలో షాదీఖానా నిర్వహణ బాగా లేదని,  షాదీఖానా నిర్వహణ కోసం మరో రూ. 50 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పి. నీరజ, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు.