బొప్పాయి పండులోని విత్తనాలను చాలా మంది పడేస్తుంటారు. అయితే దీటిలో చాలా పోషకాలు ఉంటాయి. బొప్పాయి విత్తనాలు తినేందుకు కాస్త వగరుగా ఉన్నా ఆరోగ్యానికి వేమలు చేస్తాయి. బొప్పాయి గింజలు తినడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
బొప్పాయి గింజలను నేరుగా కాకున్నా సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఈ గింజలను ఎండపెట్టి ఆ తర్వాత పొడి చేరసుకొని సలాడ్లు, ఫుడ్ లో చల్లుకొని తినొచ్చు.
బొప్పాయి విత్తనాల్లో డైయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియలను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు ఈ విత్తనాలు ఉపకరిస్తాయి.
Also Read :- పెరుగు తింటే బరువు పెరగరు
బొప్పాయి గింజల్లో విటమిన్ సీ మెండుగా ఉంటుంది. దీంతో ఇవి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.
బొప్పాయి విత్తనాల్లో ఉండే కార్పైన్, ఫైబర్.. పేగుల కదలికలను నియంత్రిస్తాయి. దీని ద్వారా మలబద్ధకం తగ్గేందుకు ఉపకరిస్తాయి. జీర్ణక్రియకు మేలు చేస్తాయి.
బొప్పాయి విత్తనాల్లో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ సమతుల్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. దీని వల్ల మహిళల నెలసరి సమయంలో నొప్పి తగ్గేందుకు ఈ విత్తనాలు తోడ్పడతాయి.