B 12 విటమిన్ పుష్కలంగా ఉండే 7 డ్రై ఫ్రూట్స్ ఇవే..

B 12 విటమిన్ పుష్కలంగా ఉండే 7 డ్రై ఫ్రూట్స్ ఇవే..

వందకు తొంభై శాతం రోగాలు మనం తినే ఫుడ్ వల్లనో లేక తినాల్సిన ఫుడ్ తినకపోవడం వల్లనో వచ్చేవే ఉంటాయి. ఒక్క తినే ఆహారం విషయంలో కరెక్ట్ డైట్ ఫ్వాలో అయితే చిన్న ఆరోగ్య సమస్య కూడా రాదు. హెల్తీగా ఉండాలంటే శరీరంలో విటమిన్ B12 పాత్ర చాలా కీలకం..  కోబాలమిన్ అనే పోషకాన్నే విటమిన్ B 12 అంటారు. ఈ విటమిన్ లోపం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. విటమిన్ B12 లోపం అంటే రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువ స్థాయిలో ఉంటే. కోబాలమిన్ ప్లేట్‌లెట్స్, ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఈ పోషకం లోపం ఉన్నప్పుడు, రక్తంలో ఎర్ర రక్త కణాల లోపం కూడా ఉంటుంది. 

B12 లోపం వల్ల వచ్చే వ్యాధులు

  • చర్మం పసుపు రంగులోకి మారడం
  • నాలుక ఎర్రగా మారడం
  • నోటి పూత
  • నడకలో తేడా, అయోమయం
  • కళ్ళు సరిగ్గా కనపడకపోవడం
  • చిరాకు, మొమరీ లాస్
  • డిప్రెషన్, మలబద్ధకం, కాళ్లు చేతులు తిమ్మర్లు

వ్యాధులతో రోగి కోలుకోవాలన్నా బి12 విటమిన్స్ చాలా అవసరం.. ఈ మిటమిన్ సప్లమెంట్  ట్యాబెట్ల రూపంలో తీసకోవడం కంటే న్యాచురల్ గా దొరికే ఆహర  పదార్థాల రూపంలో తీసుకోవడం బెటర్. ఈ కింద ఉన్న డ్రైఫ్రూట్స్ లో బి12 విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.

B 12 లభించే ఆహారపదార్థాలు

  • బాదం
  • ఖజ్జూరం
  • వాల్ నట్స్
  • పొద్దుతిరుగుడు గింజలు
  • గుమ్మడి గింజలు
  • జీడిపప్పు
  • అత్తిపండు