
కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైంది. 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను పార్టీ అధిష్టానం నిన్న (అక్టోబర్ 27)న విడుదల చేసింది. ఈ నెల 15న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 100 సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులెన తేలిపోయింది. నాలుగు సీట్లను సీపీఐ, సీపీఎం కు కేటాయించారు. ఇందులో చెన్నూరు, కొత్తగూడెం సీపీకి ఇవ్వనున్నారు. సీపీఎంకు రెండు సెగ్మెంట్లు కేటాయించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ఆ టికెట్ పెండింగ్ లో పెట్టారు.
షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగినా దానినీ పెండింగ్ లో పెట్టారు. సిద్దిపేట నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిరిసిల్ల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సిద్దిపేటకు హరికృష్ణ పేరును అధిష్టానం ప్రకటించింది. సిరిసిల్ల పెండింగ్ లో పెట్టింది. 15 సీట్లలో స్క్రీనింగ్ కమిటీలో, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం రాకపోవడం వాటి నిర్ణయాధికారాన్ని ఏఐసీసీకి అప్పగించారు. దీంతో ఆ స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనేది సస్పెన్స్ గా మారింది.
Also Read :- పీజేఆర్ కొడుకు విష్ణు పరిస్థితి ఏంటీ
కాంగ్రెస్ ప్రకటించని సెగ్మెంట్ లు...
1. వైరా
2. కొత్తగూడెం
3. మిర్యాలగూడ
4. చెన్నూరు
5. చార్మినార్
6.నిజామాబాద్ అర్బన్
7. కామారెడ్డి
8. సిరిసిల్ల
9. సూర్యాపేట
10. తుంగతుర్తి
11. బాన్సువాడ
12. జుక్కల్
13. పటాన్ చెరువు
14. కరీంనగర్
15. ఇల్లందు
16. డోర్నకల్
17. సత్తుపల్లి
18 నారాయణ ఖేడ్
19. అశ్వారావుపేట