కేంద్రమంత్రి పదువులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు. 2014లో ఎన్డీఏలో భాగస్వామైన టీడీపీకి కూడా ఇదే శాఖ దక్కింది. అప్పుడు విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు ఇదే శాఖను కేటాయించారు. ఇక శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, స్టీ్ల్ శాఖల సహాయమంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణ అభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
మోదీ 3.0 కేబినెట్ లో పాత మంత్రలుకే కీలక శాఖలు దక్కాయి. అమిత్ షాకు మరోసారి కేంద్ర హోంశాఖ కేటాయించగా... నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖ, రాజ్‌నాథ్‌కు మళ్లీ రక్షణశాఖ, నిర్మలాసీతారామన్‌కు మళ్లీ ఆర్థికశాఖ.. జయశంకర్‌కు మళ్లీ విదేశాంగ శాఖను కట్టబెట్టారు.