భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ పార్టీ MP అభ్యర్థులు వీరే

ఉమ్మడి నల్గొండ జిల్లా లోక్ నియోజకవర్గాల్లో నిలబడే ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులను శనివారం ఆపార్టీ ప్రకటించింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ను పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబెట్టనుంది. 

తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను ఒకటి రెండు తప్ప మిగిలిన స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. క్యామ మల్లేశ్ ( కురుమ ) స్వస్థలం రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగుడ గ్రామం. నల్గొండ  మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణా రెడ్డి ఈయన ఇది వరకు ఏ పదవికీ పోటీ చేయలేదు.