దేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు ముఖేష్ అంబానీది

అంటీలియా: ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంటి పేరే అంటీలియా. దేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లుగా దీనికి పేరుంది. మొత్తం 27 అంతస్తులు ఉన్న ఈ బిల్డింగ్ కాస్ట్‌‌ రూ.12, 000 కోట్లు.  ఈ బిల్డింగ్‌‌లో ఐస్‌‌క్రీమ్ పార్లర్‌‌‌‌, సెలూన్‌‌, మూవీ థియేటర్‌‌‌‌, మల్టీ ఫ్లోర్ కారు పార్కింగ్‌‌, మూడు హెలిప్యాడ్‌‌లు, స్విమ్మింగ్ పూల్‌‌ వంటి అన్ని రకాల వసతులు ఇందులో ఉన్నాయి. ఈ ఇంటిని ఆస్ట్రేలియాకు చెందిన కన్‌‌స్ట్రక్షన్ కంపెనీ లైటన్‌‌ హోల్డింగ్స్ నిర్మించగా, చికాగో కంపెనీ పెర్కిన్స్‌‌ అండ్ విల్‌‌ డిజైన్ చేసింది.

జేకే హౌస్‌‌: అంటీలియా తర్వాత అత్యంత ఎత్తైన బిల్డింగ్‌‌గా జేకే హౌస్‌‌కు పేరుంది. ఇండస్ట్రియలిస్ట్‌‌ గౌతమ్‌‌ సింఘానియాకు చెందిందే ఈ ఇల్లు. మొత్తం 16,000 చదరపు అడుగుల్లో కట్టిన ఈ ఇంట్లో 30 అంతస్తులు ఉంటాయి. మొత్తం ఐదు ఫ్లోర్లు పార్కింగ్ కోసం వదిలేశారు. రెండు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్‌‌ ఈ ఇంట్లో ఉన్నాయి. స్పా, హెలీప్యాడ్‌‌, జిమ్‌‌, ఆర్ట్‌‌ గ్యాలరీ, మ్యూజియం వంటివి కూడా జేకే హౌస్‌‌లో ఉన్నాయి. సౌత్ ముంబైలో ఉన్న ఈ ఇంటి విలువ రూ. 6,000 కోట్లు ఉంటుందని అంచనా.

అబోడ్‌‌: మొత్తం 16,000 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ ఇల్లు  ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి చెందింది. ఈ ఇల్లు 70 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇంటిపైన ఒక హెలీప్యాడ్ ఉంటుంది. అబోడ్ ధర రూ. 5 వేల కోట్లు ఉంటుందని అంచనా. 

జాటియా హౌస్‌‌: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్‌‌‌‌ మంగళంబిర్లాకు మొతం 30 వేల చదరపు అడుగుల్లో విస్తరించిన పెద్ద ఇల్లు ఉంది. ఈ ఇంటి విలువ రూ. 425 కోట్లు ఉంటుందని అంచనా. సముద్రానికి ఎదురుగా ఉండే ఈ ఇంట్లో, 20 బెడ్‌‌ రూమ్‌‌లు, ఒక చెరువు, పెద్ద గార్డెన్ వంటివి ఉన్నాయి. 

మన్నత్‌‌:  సూపర్‌‌‌‌స్టార్  షారుక్ ఖాన్ ఇల్లు బాలీవుడ్ ఫ్యాన్స్‌‌కు టూరిస్ట్‌‌ ప్లేస్‌‌లా మారింది. మొత్తం రూ. 200 కోట్ల విలువైన ఈ ఇల్లు ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉంది. అరేబియా సముద్రానికి ఎదురుగా ఉండే ఈ ఇల్లు అందరిని ఆకట్టుకుంటోంది. 

జిందాల్ హౌస్‌‌: న్యూఢిల్లీలోని అత్యంత ఖరీదైన ఏరియాలో ఇండస్ట్రియలిస్ట్‌‌ నవీన్ జిందాల్ ఇల్లు ఉంది. మొత్తం మూడెకరాల్లో విస్తరించిన ఈ ఇంటి ఖరీదు రూ. 125–150 కోట్లు ఉంటుందని అంచనా. 

రతన్ టాటా రిటైర్‌‌మెంట్ హౌస్‌‌: రతన్ టాటా రిటైర్‌‌‌‌మెంట్ హౌస్‌‌ ముంబైలోని కొలాబాలో ఉంది. మొత్తం 13,350 చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ ఇంటిలో ఏడు అంతస్తులు ఉన్నాయి. జిమ్‌‌, మీడియా రూమ్‌‌, పార్కింగ్ ఏరియా వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఇల్లు కాస్ట్‌‌ రూ. 150 కోట్లుగా ఉంటుందని అంచనా.