Kalki 2898 AD: కల్కి ఇప్పటివరకు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే.. ఇంకెవరికైనా సాధ్యమేనా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్, వాటిని నాగ్ అశ్విన్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో అరుదైన కొన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేసింది కల్కి మూవీ. మరి ఈ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • నైజాంలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ RRR రూ. 23 కోట్ల రికార్డ్ ను రూ.24 కోట్లతో బ్రేక్ చేసింది కల్కి.
  • కల్కి సినిమా కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
  • ఫస్ట్ వీకెండ్ ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన షారుఖ్ జవాన్ రూ.520 కోట్ల రికార్డుని రూ.555 కోట్లతో  బ్రేక్ చేసింది కల్కి.
  • అమెరికాలో అతిత్వరగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా కల్కి.
  • అమెరికాలో RRR 14 మిలియన్ డాలర్స్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేయబోతోంది కల్కి.
  • ఈ సంవత్సరం అత్యధికం వసూళ్లు సాధించిన హనుమాన్ రూ.350 కోట్ల రికార్డ్ ను కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ చేసింది కల్కి.
  • కెనడాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ ఇండియన్ మూవీ కల్కి.
  • బుక్ మై షోలో ఐదురోజుల్లో వరుసగా ప్రతి రోజు ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమా కల్కి.

also read : మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్న బలగం ప్రొడ్యూసర్స్..టైటిల్, టీజర్ అప్డేట్ ఇదే

ఇలా చాలా రికార్డ్స్ ను బ్రేక్ చేసి తనపేరున తిరగరాసింది కల్కి మూవీ. పైన తెలిపిన రికార్డ్స్ అన్నీ కూడా కేవలం విడుదలైన ఐదు రోజుల్లో క్రియేట్ చేసినవే కావడం విశేషం. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది కల్కి.