Gaddar: గద్దర్ రాసిన పాటలు.. నటించిన సినిమాలు ఇవే...

Gaddar: గద్దర్ రాసిన పాటలు.. నటించిన సినిమాలు ఇవే...

ప్రముఖ కవి,గాయకుడు,సంగీత దర్శకుడు గద్దర్(Gaddar) సినీ ప్రస్థానం ఓ విప్లవ జాలం. 1983లో బి.నరసింగరావు డైరెక్షన్ లో వచ్చిన రంగుల కల  గద్దర్ తన తొలి మూవీ. ఈ మూవీలో గద్దర్, సాయచంద్,రూప కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకు గద్దర్ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఉండటం విశేషం. ఈ మూవీలో తాను పాడిన పాటల్లో.. 

భద్రం కొడుకో.. కొడుకో కొమరన్న జరా.. పైలం కొడుకో కొమురన్న జరా..అంటూ గజ్జ కట్టి..గొంగడి భుజాన వేసుకుని పాడుతుంటే రక్తం ఉరుకుతున్నట్లు..రిక్షా ఎక్కేకాడా..తొక్కేకాడా..దిగేకాడా .. భద్రం అని ఊరు ప్రజలకు చెపుతుంటే.. ఆ జనం కళ్ళలో వెలుగులు చూశారు గద్దర్. మన ఊరు గానీ ఊరు..పల్లె కానీ పల్లె.. ఇది పట్నం కొడుకో..కొమురన్న జరా అంటూ..ముందుగానే యువతకు దిశా నిర్దేశం చేసిన ఘనత గద్దర్ కు మాత్రమే దక్కుతుంది. 

జామ్ జమల్మార్రి..   వెయ్య్ కలజారీ అంటూ.. జాలి లేని లోకం.. అరే జబ్బర్దాస్త్ లోకం.. ఆ న్యాయమైన నేరం, ఈ నేటి నీతి సారం.. ఆ ఒకరి సుఖం కోసం..ఇంకొకరి బాధ మోసం..మనిషి మీద మనిషికే..మమాకారం లేదు..అంటూ జాతీ నీతిని, లోకం పోకడను కళ్ళకు కట్టినట్లు పాడి.. ఎంతో మందికి కనువిప్పు అయ్యేలా చేశారు గద్దర్. 

మదనా సుందరి..మదనా సుందరి.. కొమ్మల్లో మెరిసేటి ని బొట్టు చూసి.. నీలల్ల కదిలేటి నీ నీడను చూసి, వెన్నెల రాత్రుల్లో  వన్నెలు చూసి, దారిన పోవంగా దొరగాడే చూసే, సందులు గాసిండు..సైగ చేసిండు.. కనపడ్డ కన్నెలకు కన్ను గీటిండు.. కన్నుల్లా కడివేడు జిల్లేడు పాలు, నడుమున కొడవళ్ళ కొసలు మెరువంగా., బ్రహ్మ జమ్ముడు నరక బాట పట్టిందో.. అంటూ తెలంగాణ జాగీరు దారుల దౌర్జన్యాలను, దాసీలా చూసే రాచరిక పాలన వల్ల.. మన తెలంగాణ ఆడపిల్లలు.. ఎలా నరకం అనుభవించారో.ఈ పాటతో మన ఆడపడుచుల్లో.. ఎంత చైతన్యం రగిలిందో.. తేటా తెల్లం అయ్యేలా ఎమోషన్ ట్యూన్ లో చక్కగా వివరించారు గద్దర్. 

ఆ తర్వాత మరెన్నో ఆర్ నారాయణ మూర్తి సినిమాల్లో పాటలు రాసి ఎంతో పేరు తెచ్చుకున్నారు గద్దర్. 
దండకారణ్యం..  గిచ్చన్న గిరి మల్లెలో.. అంటూ తెలంగాణలోని అన్ని జిల్లాలోని నదుల పోకడను, లంచగొండిగాళ్ళ అవినీతి, అంటరానితనం అసమానతలను వివరిస్తూ రాసిన గీతం గద్దర్ కు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 
పొద్దు తిరుగుడు పువ్వు..అడవిలో వెన్నెలమ్మ.. ఆకులను ముద్దాడే అంటూ అడవి తల్లి నేపథ్యంతో గద్దర్ పాడగా.. భారత దేశం నా మాతృ భూమి ..మరో పాటతో ఉరకలు ఎక్కించారు గద్దర్. కాగా 

ఒరేయ్ రిక్షా మూవీ లో గద్దర్ రాసిన.. నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ..అనే పాట ఎంతో మంది హృదయాలను హత్తుకుంది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గీతంగా..నంది అవార్డు కూడా ఇస్తూ సత్కరించింది. కానీ ఆయన ఆ అవార్డ్ ను సున్నితంగా తిరస్కరించారు. 

ఎన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన  జై బోలో తెలంగాణా మూవీలో గద్దర్..పొడుస్తున్న పొద్దూ మీద నడుస్తున్న కాలమా.. అంటూ రాసిన పాట ఎంతో ప్రేరణ కలిగించారు. ఈ మూవీలో ఆయనే తెరపైన కనిపించి.. పాడటం విశేషం. ఈ పాట అద్భుత విజయం సాధించింది. ఆయన రాసిన అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా.. అనే పాటను తెలంగాణా రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగిన విషయం తెలిసేందే.

ఆయన రాసిన  పాటల్లో..అమ్మ తెలంగాణమా..అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ సాంగ్ తెలంగాణా లోని అన్ని అంశాలను ప్రస్తావిస్తూ  పాటతో తెలంగాణాలోని ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించింది.

దుక్కులు దున్నిన రైతు సేతులకు..బేడీ లెందుకు అన్న.. అంటూ నారాయణమూర్తి డైరెక్షన్ లో వచ్చిన అన్నదాత సుఖీభవ లో.. పాట పాడారు గద్దర్. ఇవే కాకుండా గద్దర్ లిరిక్ రైటర్ గా..గాయకుడుగా.. ఎర్ర సైన్యం, మార్కెట్లో ప్రజాస్వామ్యం, అన్నదాత సుఖీభవ, 2016 లో దండాకారుణ్యం, ఎర్రోడు, రంగుల కల, RGV కొండా, సాఫ్ట్ వేర్ సుధీర్, ఇలా పలు సినిమాలకు వర్క్ చేశారు.  

ఆగస్టు 6 2023న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన గద్దర్.. ఆయన విప్లవ స్ఫూర్తికి తెలంగాణం ఎప్పుడు వందనం తెలుపుకుంటుంది.