ముప్పావు కప్పు ఎండబెట్టిన గులాబీ రేకులు లేదా అరకప్పు తాజా గులాబీ రేకుల్ని శుభ్రంగా కడగాలి.
- వెడల్పాటి గిన్నెలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి, మరిగించాలి.
- గులాబీ రేకులు వేసి, సన్నటి మంట మీద మరికాసేపు మరిగించాలి. గులాబీ రేకులు రంగు మారాక స్టవ్ ఆపేయాలి.
- ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక నీళ్లని వడగట్టి, గాజు సీసాలోకి తీయాలి.
- ఆ తర్వాత వారం, పది రోజులు ఫ్రిజ్‌లో పెడితే రోజ్ వాటర్ రెడీ.
- కావాలనుకుంటే గులాబీ పువ్వు మధ్యలో ఉండే కేసరాలని గులాబీ రెమ్మలతో కలిపి మరిగించొచ్చు. దీనివల్ల మంచి వాసన వస్తుంది. అయితే ఈ ప్రాసెస్‌కి కేవలం నాటు గులాబీలని మాత్రమే వాడాలి.
- రోజ్ వాటర్‌లో విటమిన్– ఎ, సి, డి, ఈలతో పాటు యాంటీ ఏజెనింగ్ ప్రాపర్టీలు ఉంటాయి. అందుకే చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.