Kalki 2898 AD: కల్కిలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇవే.. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవడం ఖాయం

Kalki 2898 AD: కల్కిలో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇవే.. ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవడం ఖాయం

ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చింది. భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. అద్భుతమైన కథ, కథనాలు, హాలీవుడ్ లెవల్ విజువల్ ఎఫెక్ట్స్, సరికొత్త ప్రెజెంటేషన్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ తాను అనుకున్న కాన్సెప్ట్ ను, విజన్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ, ఇండియన్ స్టాండర్డ్స్ పెంచడం ఖాయం అంటూ ప్రేక్షకులు, మరీ ,ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరెస్తూన్నారు.

అయితే.. భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి సినిమాలో ప్రేక్షకుల ఊహలకు అందని చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ను ప్రెజెంట్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. వాటి గురించి ముందుగా తెలియకపోవడంతో తెరపై చూసి అవాక్కవుతున్నారు ఆడియన్స్. మరి కల్కి సినిమాలో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్న ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుదం. నిజానికి కల్కి సినిమా స్టార్ కాస్ట్ విషయానికి వస్తే.. మనకు ఇప్పటివరకు చూపించింది ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని మాత్రమే. 

ఇక ఇంకా ఈ సినిమాలో టాలీవుడ్ కు సంబంధించిన చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారట. అందులో.. ముందుగా నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, దర్శకధీరుడు రాజమౌళి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మృణాల్ కీ రోల్స్ లోన్ కనిపించారు. అలా ఒకేసారి టాలీవుడ్ స్టార్స్ ని ఒకే సినిమాలో చూడటం ఆడియన్స్ కి థ్రిల్ కలిగించింది. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. మొదటిరోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.