Health News : ఉదయం నిద్ర లేవగానే మీ నోటిలో తడి లేదా.. అయితే మీకు షుగర్ ఉన్నట్లే..!

Health News : ఉదయం నిద్ర లేవగానే మీ నోటిలో తడి లేదా.. అయితే మీకు షుగర్ ఉన్నట్లే..!

మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. శరీరంలో బ్లడ్ షుగర్ పరిమాణం పెరిగి ... ఇన్సులిన్ లోపిస్తే మధుమేహం వ్యాధి వస్తుంది. మధుమేహం చాలా ప్రమాదకరమైనది. మదుమేహం వచ్చిందంటే శరీరంలోని అన్ని భాగాలపై దాని ప్రభావం చూపుతుంది.  గతంలో మధుమేహం వ్యాధి వయస్సు ముదిరిన తరువాత వచ్చది.  కాని ఇప్పుడు వయస్సుతో సంబంధం లేదు... ఆరేళ్ల పిల్లలు కూడా మధుమేహ బాధితులుగా మారుతున్నారు. 

 పిల్లలు మరియు యువత టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతుంటే ...  40 ఏళ్లు పైబడిన వారు  టైప్ 2 డయాబెటిస్‌కు గురవుతున్నారు.  రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం లేవగానే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.

ALSO READ | Health Tip : పెరుగు తింటే బరువు పెరగరు.. తగ్గుతారు..!

 శరీరం  రక్షణ యంత్రాంగం, రోగనిరోధక వ్యవస్థ, ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ బీటా కణాలను లక్ష్యంగా చేసుకుని చంపుతుంది.   దీని ఫలితంగా టైప్ 1 మధుమేహం వస్తుంది. టైప్​ 2 జన్యువులు ...  జీవనశైలి ఎంపికలతో సహా అనేక వేరియబుల్స్ ద్వారా మధుమేహం వస్తుంది.  

  •  రక్తంలో గ్లూకోజ్​ శాతం పెరిగితే...  నోరు తడి ఆరిపోవడం.. చాలా దాహంగా అనిపించినా...  రక్తంలో చక్కెర పెరుగుదలకు సంకేతమని వైద్య నిపుణులు అంటున్నారు.   షుగర్ లెవెల్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్ గొంతు  ఉదయం పూట  ఎండిపోతుంది. 
  • రక్తంలో గ్లూకోజ్​ శాతం ఉండాల్సిన దానికంటే ఎక్కువుగా ఉంటే... ఒక్కొక్కసారి నిద్రలేవడంతోనే కళ్లు సరిగా కనపడవు. దృష్టి మసక.. మసకగా ఉంటుంది.  మధుమేహం కళ్లను తొందరగా ప్రభావితం చేస్తుంది. .
  • అలసటగా అనిపించడం.... - పొద్దున్నే నిద్రలేవడం తోనే  బలహీనంగా అనిపిస్తే...  ఒకసారి మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల అలసట...  ఒత్తిడి పెరుగుతుంది. 
  • చాలామందికి చేతులు వణుకుతాయి.  రక్తంలో గ్లూకోజ్​ లెవల్స్​  4 mmol తక్కువగా ఉన్నప్పుడు చేతుల్లో చెమట.. వణుకు  వంటి లక్షణాలు కనపడుతాయి.  ఇలాంటి లక్షణాలు మీరు నిద్ర లేవడంతోను గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.