ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ శుక్రవారం (సెప్టెంబరు 13న) కూడా థియేటర్ విభిన్న కథలతో కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేవి చూద్దాం.
మత్తు వదలరా2
'మత్తు వదలరా’ చిత్రంతో సక్సెస్‌ను అందుకున్న కీరవాణి కొడుకు శ్రీసింహ కోడూరి..ఇప్పుడు దీని సీక్వెల్ (మత్తు వదలరా 2) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్‌లో నటిస్తోంది. టీజర్, ట్రైలర్ తో చూపించిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో ఆడియాన్స్ లో అంచనాలు పెంచేసారు మేకర్స్.
ALSO READ ; ఫ్యామిలీ అంతా నవ్వుకునే మూవీ : డైరెక్టర్ మారుతి
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.సునీల్, సత్య, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఇవాళ (సెప్టెంబరు 13న) విడుదల అయింది.
భలే ఉన్నాడే:
రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భలే ఉన్నాడే’. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 13న) వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన సెప్టెంబర్ 7న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని ఒక వారం వాయిదా వేస్తూ సెప్టెంబర్ 13న రిలీజ్ చేశారు మేకర్స్.
ఉత్సవం
రెజీనా, దిలీప్ ప్రకాష్ లీడ్ రోల్స్‌లో అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన చిత్రం ‘ఉత్సవం’. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నేడు శుక్రవారం సెప్టెంబర్ 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
నాటకరంగం, రంగస్థలం బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ అర్జున్ సాయి చాలా బ్యూటీఫుల్ గా స్క్రిప్ట్ చేశారు. నాటకరంగాన్ని నేపధ్యంగా ఎంచుకొని ’ఉత్సవం’ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు.
కళింగ
కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి విభిన్నమైన కథతో...వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిన కళింగ మూవీ ఇవాళ శుక్రవారం సెప్టెంబర్ 13న రిలీజ్ కానుంది.
సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతోన్నా కూడా..సినిమా మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందే ప్రీమియర్లు వేశారు మేకర్స్. ఈ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఆడియెన్స్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.