విద్యా కమిషన్ ముగ్గురు సభ్యులు వీరే

విద్యా కమిషన్ ముగ్గురు సభ్యులు వీరే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ కు సభ్యులను నియమించింది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యా కమిషన్ మెంబర్స్ గా అక్టోబర్ 18న ( శుక్రవారం) ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, చెరగొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డిలను కేటాయించింది. వీరు త్వరలోనే బాధ్యతలను తీసుకోనున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి విద్యా కమిషన్ పని చేయనుంది. విద్యాకమిషన్ ఛైర్మెన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఉన్నారు.

 చైర్మన్ తోపాటు ముగ్గురు సభ్యులు,సెక్రటరీతో ఈ కమిషన్ ఏర్పాటైంది. విద్యా రంగంలో మార్పులు, విద్యారంగం బలోపేతానికి ఈ కమిషన్ ను నియమించారు. ఉన్నత విద్యా నాణ్యతా, ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కమిషన్ సూచనలివ్వనుంది. త్వర లో విద్యాకమిషన్  చైర్మన్,  సభ్యులను నియమించనున్నారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కమిషన్ పనిచేస్తుంది. 

ALSO READ | గ్రూప్‌–1 మెయిన్స్ ఎగ్జామ్స్కు లైన్ క్లియర్.. అప్పీల్‌ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు