సిటీలో వాటర్ జామ్ అయ్యే ప్రాంతాలివేనట..

సిటీలో వాటర్ జామ్ అయ్యే ప్రాంతాలివేనట..
  • గ్రేటర్​లో 184 ప్రాంతాల్లో వాన నీళ్లు ఆగుతున్నయ్​
  • గ్రేటర్‌‌లోని వాటర్​ లాగింగ్​ పాయింట్లపై ట్రాఫిక్​ పోలీసులు ఫోకస్​ 
  • కంట్రోల్​ రూమ్​ , జీహెచ్‌‌ఎంసీ సమన్వయంతో చర్యలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో వానొస్తే రోడ్లపై వరద నిలిచిపోయే వాటర్‌‌‌‌ లాగింగ్​పాయింట్లపై ట్రాఫిక్ ​పోలీసులు ఫోకస్‌‌ చేశారు. ఇప్పటికే గ్రేటర్‌‌‌‌ పరిధిలో గుర్తించిన 184 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. అదేవిధంగా ట్రాఫిక్ జామ్‌‌ అయ్యే ఏరియాల్లోనూ ప్రత్యేకంగా ఫోకస్​ చేశారు.  ట్రాఫిక్ పోలీసులకు ఇప్పటికే సంబంధిత సామగ్రి అందించగా, కంట్రోల్‌‌ రూమ్, జీహెచ్‌‌ఎంసీ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మెయిన్‌‌ రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న18 వాటర్ లాగింగ్​ పాయింట్లతో పాటు మెట్రో డివైడర్ల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోతుంది. వానాకాలం వస్తే ఆయా ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సాయంత్రం వేళ అధికంగా ట్రాఫిక్ జామ్‌‌లు అవుతుంటాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌‌ఎంసీ, వాటర్‌‌‌‌ బోర్డ్ అధికారులతో ట్రాఫిక్‌‌ పోలీసులు ఇప్పటికే వాటర్ ​లాగింగ్​పాయింట్లపై సమీక్షించారు.

25 ట్రాఫిక్ క్రేన్లతో రోడ్‌‌ క్లియరెన్స్
రోడ్లపై వరద నీరు నిల్వకుండా  వెంటనే తోడేందుకు మోటా ర్లు, 25 ట్రాఫిక్ క్రేన్లు,19 రకాల డిజాస్టర్ పరికరాలతో రెస్క్యూ టీమ్స్‌‌ ను ఏర్పాటు చేశారు. డ్రైనేజీలు పొంగి రోడ్లపై చేరే వరద నీరు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు. రోడ్లపై గుంతలను కూడా గుర్తించి పూడ్చివేస్తారు. సోషల్ మీడియా, ఎఫ్ ఎం రేడియో, ట్రాఫిక్‌‌ పోలీస్ యాప్స్‌‌లో వాటిని ట్రాఫిక్ అప్​డేట్​చేస్తుంటారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సైన్‌‌ బోర్డ్స్‌‌ పెట్టి ట్రాఫిక్ డైవర్ట్‌‌ చేసేలా చర్యలు తీసుకుంటారు.

సిటీలో మేజర్‌‌ వాటర్‌‌ లాగింగ్ ​పాయింట్లు ఇక్కడే..
పంజాగుట్ట: ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ఫ్లై ఓవర్, లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్​ రాజ్‌భవన్‌ రోడ్‌, ధరమ్ కరమ్​ రోడ్‌. 
బేగంపేట్‌: యాక్సిస్‌ బ్యాంక్‌, కర్బాలా మైదాన్‌, ఆర్పీ రోడ్‌
సైఫాబాద్‌: షాదన్ కాలేజ్‌, అయోధ్య జంక్షన్‌, మ్యాక్సీక్యూర్ హాస్పిటల్‌.
నాంపల్లి: పోలీస్‌ కంట్రోల్‌ రూమ్ జంక్షన్‌.
సికింద్రాబాద్‌: రైలు నిలయం జంక్షన్, ఆలుగడ్డ బావి.
ఆర్పీరోడ్‌: కార్ఖానా రోడ్‌, కేఎఫ్‌సీ,ఆర్పీ రోడ్‌ చిత్రదుర్గ.
సుల్తాన్‌ బజార్‌‌: రంగమహల్‌, అఫ్జల్‌గంజ్‌ సెంట్రల్‌ లైబ్రరీ
మలక్‌పేట్‌: అక్బర్ ప్లాజా, మలక్‌పేట్ గంజ్‌, చాదర్‌‌ఘాట్ రైల్వే ఆర్‌‌ఓబీ. 
బంజారాహిల్స్‌: రోడ్‌ నంబర్‌‌ 12  కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌‌,పెన్షన్‌ ఆఫీస్‌ సిగ్నల్. 
జూబ్లీహిల్స్‌: రోడ్ నంబర్‌‌ 36  క్రోమా స్టోర్.​