తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆయుధాల వివరాలను రాజకీయ నేతలు తమ ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించారు. బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు వద్ద 1.3 లక్షల విలువ చేసే పిస్టల్(గన్) ఉన్నట్టుగా తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వద్ద 2లక్షల విలువ చేసే పిస్టల్, 50వేలు విలువైన రైఫిల్ ఉందని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వద్ద కుటుంబ వారసత్వ పిస్టల్‌తో సహా మూడు ఆయుధాలను కలిగి ఉన్నట్టుగా తెలిపారు.
మరోవైపు తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటి(నవంబర్ 15)తో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు టైమ్ ఉంటుంది. ఈ క్రమంలో రెబల్స్ ను నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రధాన పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. 3 గంటల తర్వాత మిగిలిన అభ్యర్థలకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించననున్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 03న ఫలితాలు వెలువడనున్నాయి.