రెండేండ్లుగా ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా కేసుల విషయంలో రోజుకో రికార్డ్ నమోదైంది. కరోనా బారినపడి కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఇప్పటికీ కొన్ని దేశాలలో మాత్రం కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ప్రపంచంలోని ఓ పది దేశాలలో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ దేశాలు పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలోని ద్వీపాలు, సముద్రానికి సరిహద్దుగా ఉన్న దేశాలు కావడం వల్లే ఇది సాధ్యమైందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. టోంగా దేశంలో ఇటీవల అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో ఆ ద్వీప దేశానికి సాయం చేయడానికి కొన్ని నౌకలు వెళ్లాయి. దాంతో అక్కడ కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. అదేవిధంగా కుక్ దీవులలో కూడా గత వారమే కరోనా మొదటి కేసు నమోదైంది.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. కరోనా కేసులు నమోదు కానీ దేశాలు ఏవో ఓసారి చూద్దాం..
టువాలు: ఇది మూడు రీఫ్ ద్వీపాలు మరియు ఆరు అటోల్‌ల సమూహం. తన సరిహద్దులను మూసివేయడం, క్వారంటైన్ తప్పనిసరి చేయడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రతి 100 మంది జనాభాకు దాదాపు 50 మంది టీకాలు తీసుకున్నారు.
టోకెలావ్: దక్షిణ పసిఫిక్‌లోని ఉన్న ఓ చిన్న ద్వీపం ఇది. పలు అటోల్స్తో ఈ దేశాన్ని డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ ఫ్రీ దేశంగా ప్రకటించింది. ఈ ద్వీపం న్యూజిలాండ్‌కి సమీపంలో ఉంది. ఇక్కడ కేవలం 1,500 మంది జనాభా మాత్రమే ఉన్నారు. పైగా వీరికోసం ఒక విమానాశ్రయం కూడా ఉంది.
సెయింట్ హెలెనా: ఈ ద్వీపం దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఇది బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ఇక్కడ ప్రతి 100 మందిలో 58 మంది పూర్తిగా టీకాలు తీసుకున్నారు.
పిట్‌కైర్న్ దీవులు: ఇవి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం.. ఇది పలు ద్వీపాల సమూహంతో ఏర్పాటైంది. పిట్‌కైర్న్ దీవులలో మొదటగా పాలినేషియన్లు నివాసముండేవారు. అయితే 1606లో యూరోపియన్లు ఈ దీవులను కనుగొనే సమయానికి అక్కడ జనజీవనం అంతరించిపోయింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రతి 100 మందిలో 74 మంది వ్యక్తులు ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
నియు: ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మరో ద్వీప దేశం. ఇది బొగ్గు రీఫ్ డైవ్ సైట్లకు ప్రసిద్ధి చెందింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ఇక్కడ ప్రతి 100 మందిలో 79 మంది పూర్తిగా వ్యాక్సిన్ వేయబడ్డారు.
నౌరు: ఈ చిన్న దేశం ఆస్ట్రేలియాకు ఈశాన్యంలో ఉంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపనీస్‌కు అవుట్పోస్ట్లాగా కూడా ఉండేది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రతి 100 మందికి దాదాపు 68 మంది పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్నారు.
మైక్రోనేషియా: అమెరికాలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ దేశం నాలుగు రాష్ట్రాలతో కూడి ఉంది. చుక్, కోస్రే, పోహ్న్‌పే మరియు యాప్.. ఈ నాలుగు రాష్ట్రాలు కలిసి మైక్రోనేషియా దేశం. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. మైక్రోనేషియాలో ప్రతి 100 మందిలో 38 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఈ చిన్న ద్వీప దేశాలతో పాటు తుర్క్‌మెనిస్తాన్, ఉత్తర కొరియాలను కూడా డబ్ల్యూహెచ్ఓ కరోనా ఫ్రీ దేశాల జాబితాలో చేర్చింది.
For More News..
ఎంప్లాయ్‌కి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన ఓనర్
సన్నీ లియోనీ పాన్ నెంబర్ తో లోన్ తీసుకుండు