
గీతలో ప్రతి శ్లోకమూ ఒక ఆణిముత్యమే. కాలంతో సంబంధం లేకుండా వాటిని ఎప్పుడైనా మన జీవితానికి అన్వయించుకుంటే చాలు.. సంతోషంగా జీవిస్తాం. ముఖ్యంగా భగవద్గీత, రెండో అధ్యాయంలో ఉన్న ఈ ఐదు శ్లోకాలు తెలుసుకుంటే.. ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి.
పని మీద ఫోకస్ పెట్టు.. రిజల్ట్స్ మీద కాదు (శ్లోకం 47) : నీ బాధ్యతను లేదా కర్మను నెరవేర్చే హక్కు మాత్రమే నీకు ఉంది. కానీ, కర్మఫలాలతో నీకు సంబంధం లేదు. ఆ ఫలితాలకు నేనే కారణమని నీకు నువ్వే అనుకోవద్దు...కాబట్టి... ప్రతిఫలాన్ని ఆశించి కర్మలు చేయకుఅలాగని కర్మలకు దూరం జరగకూడదు.
భయం వద్దు.. ఆత్మకు చావు, పుట్టుకలు లేవు (శ్లోకం 20) : భయం లేకుండా బతుకు మిత్రమా! జీవితంలో అన్నింటికంటే పెద్ద భయం చావు తాలూకు ఆలోచనే. మనమంతా ఒక రోజు చనిపోతాం. కానీ, దాని గురించి బాధపడకు, ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అది శాశ్వతమైనది. దానికి వయసు లేదు. శరీరం నాశనమైతే ఆత్మ నాశనమైనట్టు కాదని తెలుసుకోవాలి.
Also Read:-మానవజన్మ చలివేంద్రం లాంటిది
నరకానికి మూడు దారులు (శ్లోకం 21) : నరకం చేరుకోవడానికి మూడు దారులున్నాయి. ఒకటి కామం, రెండోది కోపం, మూడోది దురాశ మనిషి జీవితంలో ప్రతి సమస్యకూ ఈ మూడింటిలోనే మూలం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటన్నింటిని వదిలేయాలి.
ఏది శాశ్వతం కాదు (శ్లోకం 14) : ఓ కుంతీ పుత్రా! ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రకృతిలో ఎండాకాలం, చలికాలం రెండూ తాత్కాలికమే! అవి వస్తూ పోతుంటాయి. అలాగే కష్టాలు కూడా వస్తూ పోతుంటాయి. వాటికి ప్రభావితం కాకుండా.. తట్టుకొని సహనంతో నిలబడటం నేర్చుకోవాలి.
సముద్రంలా ఉండు (శ్లోకం 70) : నదులు ఎప్పుడూ సముద్రంలో కలిసిపోతుంటాయి. తనలోకి నిరంతరం నదులు ప్రవహిస్తున్నా సముద్రం స్థిరంగా ఉంటుంది. నదీ ప్రవాహాల్లాగే ఆలోచనలు కూడా మెదడులోకి నిరంతరం వస్తూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నిలకడ లేని ఆలోచనలని ఆపలేని వాళ్లకు ప్రశాంతత ఉండదు. అంతేకాదు తన లక్ష్యాన్ని కూడా చేరుకోలేడని గుర్తించాలి.