Good Health : పొద్దున్నే బాదం గింజలు.. అరటి పండు తినండి... అస్సలు నీరసం ఉండదంట

Good Health : పొద్దున్నే బాదం గింజలు.. అరటి పండు తినండి... అస్సలు నీరసం ఉండదంట

చాలామందికి ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. ఆకలిగా ఉంటుంది. కొంచెం తిన్నా కూడా అరుగుదల సమస్య ఉన్నట్టుంటుంది. ఈ ఇబ్బంది నుంచి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే నానబెట్టిన బాదం గింజలు, లేదంటే ఒక అరటి పండైనా తినాలి. ఒక్క అయిదు నిమిషాలు సమయం కేటాయించి, రోజూ తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మొదలు పెట్టండి.. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణకోశం మెరుగుపడుతుంది.

 టైమ్​కు  ఆకలి వెయ్యడం, అరుగుదల పెరగడం మొదలవుతుంది. రోజూ కనీసం రెండు సార్లు మజ్జిగ తీసుకోవాలి. కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీళ్ళు తాగాలి. పండ్లు, మంచినీళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్దకం పోతుంది. పొట్ట తేలికగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ ఒక గుడ్డు, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్లతో పాటు సూప్ తీసుకుంటే బాగుంటుంది


-వెలుగు,లైఫ్​‌‌-