Health Tips:  ఇవి తిన్నారా..  మీ వయస్సు పదేళ్లు తగ్గిపోతది.. 

Health Tips:  ఇవి తిన్నారా..  మీ వయస్సు పదేళ్లు తగ్గిపోతది.. 

యవ్వనంగా ఉండాలని ఇప్పుడూ అందరు కోరుకుంటున్నారు. చాలా రకాల ఆయిల్స్, క్రీమ్స్ వాడుతుంటారు. కానీ యవ్వనంగా కనిపించాలంటే మేకప్, క్రీమ్స్ వంటివి కాకుండా సహజ సౌందర్యాన్ని పొందడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన కూరగాయలు, పండ్లు చర్మాన్ని 10 సంవత్సరాల కంటే యవ్వనంగా ఉంచేలా తయారుచేస్తుంది. అయితే ఆ ఆహార పదార్థాల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా తాము యవ్వనంగా, ఫిట్ గా, వయసు పెరుగుతున్నా కూడా అందంగా, చిన్న వయసుగానే కనిపించాలని ఆశిస్తున్నారు. ఈ తరుణంలో చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చర్మాన్ని సంరక్షించుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల ప్రొడక్ట్స్‌ను వాడుతున్నారు. ముఖంపై మచ్చలు, మొటిమలు, వృద్ధాప్య సంకేతాలు, ముడతలు వంటివి త్వరగా రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. తరచూ సమతుల ఆహారం తీసుకోవడం. పండ్లు తినడం వంటివి చేయడం వల్ల చర్మం తరచూ కాంతివంతంగా ఉంటుంది.ఆరోగ్యంతో పాటు, చర్మం అందంగా మెరిసిపోవాలని ఆశపడుతుంటారు. ఇలా కేవలం ఆడవారు మాత్రమే కాదు, మగవాళ్లలో కూడా ఇలా ఉండాలనే పోటీ పెరిగిపోయింది. అయితే తరచూ కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏకంగా 10 సంవత్సరాల వయస్సు తక్కువగా కనిపిస్తారు.

నెయ్యి:తరచూ ఆహారంలో భాగంగా నెయ్యిని తీసుకోవడం వల్ల చర్మాన్ని డిటాక్స్ చేసి ముఖంపై గ్లో పెంచుతుంది. అంతేకాదు ముడతలు, వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది. అందువల్ల రోజుకు 1 స్పూన్ నెయ్యిని తీసుకోవడం మంచిది.

బ్లూబెర్రీస్‌:బ్లూబెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఈలు యాంటీ ఏజింగ్‌గా పని చేస్తాయి.

ఆకు కూరలు:ఆహారంలో భాగంగా ఎక్కువ శాతం ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఆకుకూరలను తీసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ వంటివి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడతాయి.

అవకాడో:పండ్లలో ఖరీదైన పండైన అవకాడోతో చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవకాడోలో ఉండే విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ ఈ, బి,ఏ వంటివి యాంటీ ఏజింగ్ లక్షణాలుగా పని చేసి తక్కువ వయసున్న వారిలా కనిపించేలా చేస్తాయి.