ఇడ్లీ, దోశె, ఉప్మా.. బ్రేక్ పాస్ట్ లో మాత్రమే తింటారు చాలామంది. అయితే, వీటినే కొంచెం వెరైటీగా చేసుకుంటే సాయంత్రం స్నాక్ గా, డిన్నర్ ఐటమ్ కూడా తినొచ్చు. పైగా పిల్లలు కూడా ఇలాంటి కొత్త వంటకాలను ఇష్టంగా తింటారు. అలాంటివే ఇవి.
మసాలా ఇడ్లీకి కావలసిన పదార్థాలు:
ఇడ్లీలు: 8, పచ్చిమిర్చి: రెండు(మధ్యకు తరిగి), అల్లం : చిన్న ముక్క (తురుము) ఉల్లిపాయ: ఒకటి (సన్నగా తరిగి) టొమాటో: ఒకటి (సన్నగా తరిగి) కొత్తిమీర తరుగు: కొంచెం, పసుపు : పావు టేబుల్ స్పూన్, కారం: అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి: పావు టేబుల్ స్పూన్ సోంపు గింజల పొడి: అర టేబుల్ స్పూన్, గరంమసాలా: చిటికెడు, నిమ్మరసం: అర టేబుల్ స్పూన్, ఆవాలు: ఒక టేబుల్ స్పూన్, నూనె: ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు: రెండు రెమ్మలు, ఆయిల్: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా
తయారీ
పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేగించాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం తురుము వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేగించాలి. ఈ మిశ్రమంలోనే పసుపు, కారం, ధనియాల పొడి, సోంపు గింజల పొడి, గరం మసాలా వేగించాలి. చివరగా టొమాటో ముక్కలు వేయాలి. ఇవి వేగాక ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కలుపుకుంటే మసాలా ఇడ్లీ రెడీ. గ్రీన్ చట్నీతో వీటిని తినొచ్చు.