రోజు రోజుకు ఓటీటీల్లో సినిమాల సందడి ఎక్కువవుతోంది. ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి.
ఆ సినిమాలు ఏంటంటే....?
1. RRR
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR మూవీ ఈ నెల 20న ఓటీటీ లో రిలీజవుతోంది. థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లో సందడి చేయనుంది. ఇందులో ఆలియగా భట్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
2. దగడ్ సాంబ
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా, ఆయనకు జంటగా సోనాక్షి నటిస్తున్న దగడ్ సాంబ మూవీ కూడా ఈ వారమే విడుదల కానుంది. హృదయ కాలేయం సినిమాతో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు... ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా కూడా ఈ నెల 20న వస్తోంది.
3. శేఖర్
రాజశేఖర్ హీరోగా యాక్ట్ చేస్తున్న శేఖర్ మూవీ ఈ నెల 20న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మలయాళ మూవీ జోసెఫ్ కు రీమేక్ గా శేఖర్ రూపుదిద్దుకుంది. ఇక జీవిత ఈ సినిమాను డైరెక్ట్ చేయగా... అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.
3. ధాకడ్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ చేస్తున్న సినిమా ధాకడ్. ఈ మూవీలో ఆమె ఏజెంట్ అగ్నిగా నటిస్తున్నారు. రజనీష్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కంగనా పవర్ రోల్ లో కనిపించనుంది.
4.ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్లో రిలీజైంది. అయితే మెగా అభిమానులకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో రిలీజవుతోంది.
4. భూల్ భులాయా 2
కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా వస్తున్న భూల్ భులాయా 2 ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటస్తోంది.
7. భళా తందనాన
ఇక యువ నటుడు శ్రీ విష్ణు హీరోగా దంతలూరి డైరెక్షన్ రూపొందిన భళా తందనాన చిత్రం ఈ నెల 20న ఓటీటీలో సందడి చేయనుంది.
8. 12th మ్యాన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 12th మ్యాన్ మూవీ ఈ నెల 20న ఓటీటీలో విడుదల కానుంది. దృశ్యం, దృశ్యం2 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జీత్ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు.
ఇంకా వీటితో పాటు....
ఇంగ్లీష్
1. ద హంట్ ( మే 16 )
2. ది ఇన్విజిబుల్ మ్యాన్ ( మే 16 )
3. వూ కిల్డ్ సారా ( వెబ్ సిరీస్ 3 ) ( మే 18 )
హిందీ
1. జోంబ్లవీ ( మే 20)
కన్నడ
1. హనీమూన్ ( మే 20 )