కొత్త ఫీచర్లు మస్త్​గున్నయ్​

కొత్త ఫీచర్లు మస్త్​గున్నయ్​

స్మార్ట్​ఫోన్​​ చేతిలో ఉంటే ఇంట్లోనే కరోనా టెస్ట్ రిపోర్ట్ తెలుసుకోవచ్చు. అలాగే ఐ ఫోన్​ ఉంటే కనుక...  ఎమర్జెన్సీ టైమ్​లో ఇంట్లోవాళ్లకి ఇన్ఫర్మేషన్​ వెళ్లిపోతుంది. ​ఫొటో రీసైజ్​ చేసేందుకు గూగుల్​ క్రోమ్​ ఫొటో రీసైజింగ్​ ఫీచర్​ క్లిక్​ చేస్తే చాలు. అంతేకాదు ఇన్​స్టాగ్రామ్​ తేనున్న క్రోనలాజికల్​ ఫీడ్​ ఫీచర్​ కూడా యూజర్లకి బాగా నచ్చుతుంది. కొత్త ఏడాదిలో యూజర్ల కంఫర్ట్​, సేఫ్టీ కోసం ఇలాంటి ఫీచర్లు చాలా రాబోతున్నాయి. అలాంటి కొత్త ఫీచర్లు కొన్ని...

ఐఫోన్​లో ఎమర్జెన్సీ  

యూజర్ల సేఫ్టీ కోసం రీసెంట్​గా ‘ఎమర్జెన్సీ సాస్’​ ఫీచర్​ తీసుకొచ్చింది ఐఫోన్​. యూజర్లు  ప్రమాదంలో ఉన్నప్పుడు  వాళ్ల ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లిస్ట్​లో ఉన్నవాళ్ల​కి ఆటోమెటిక్​గా కాల్​ వెళ్తుంది. ఈ కొత్త ఫీచర్​ ఐఫోన్ 8 తో పాటు కొత్తగా వచ్చిన వెర్షన్​లలో పనిచేస్తుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్​ని యాడ్ చేసేందుకు ఐ ఫోన్​లో హెల్త్​ యాప్​ ఓపెన్​ చేయాలి. ‘మెడికల్​ ఐడీ’ మీద ట్యాప్​ చేసి, ఎడిట్​ ఆప్షన్​ సెలక్ట్​ చేసి ‘ఎమర్జెన్సీ కాంటాక్ట్స్’ లోకి వెళ్లాలి. కాంటాక్ట్స్​ యాడ్ చేయాలి. ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఆటోమెటిక్​గా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్​కి కాల్​ వెళ్తుంది. 

ఎలా పనిచేస్తుందంటే...

ఎమర్జెన్సీ టైమ్​లో పవర్ బటన్​తో పాటు వాల్యూమ్​ బటన్స్​ని కూడా గట్టిగా నొక్కి పట్టుకోవాలి. అప్పుడు స్క్రీన్ మీద ‘ఎమర్జెన్సీ సాస్​’ కౌంట్​డౌన్​ ఆప్షన్​ కనిపిస్తుంది. కౌంట్​డౌన్​ పూర్తయ్యేంత వరకు ఆ బటన్స్​ని అలాగే పట్టుకోవాలి. కౌంట్​డౌన్​ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్స్​కి కాల్​ వెళ్తుంది. కాల్​ డిస్​కనెక్ట్​​ అవ్వగానే మీరు ఉన్న లొకేషన్​ టెక్ట్స్​ మెసేజ్​ వెళ్తుంది.  

ఇన్​స్టాగ్రామ్​లో క్రోనలాజికల్​ ఫీడ్

ఇన్​స్టాగ్రామ్​లో వీడియోలు, రీల్స్​ చేస్తూ ఉంటారు చాలామంది. హోమ్​లో యూజర్లు ఫాలో అయ్యేవాళ్ల కంటెంట్​తో పాటు వేరేవాళ్ల వీడియోలు చాలా కనిపిస్తుంటాయి. యూజర్లు తమకి నచ్చిన, తాము చూడాలనుకునే కంటెంట్​ ముందుగా కనిపించే ఫీచర్​ తీసుకొస్తోంది ఇన్​స్టాగ్రామ్​. ఈ ఫీచర్​ని ఇప్పటికే కొన్ని అకౌంట్స్​లో టెస్ట్​ చేసింది కూడా. రెండు మూడు వారాల్లో ఈ ఫీచర్​ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్​ వస్తే,  హోమ్​, ఫాలోయింగ్​, ఫేవరెట్...  ఈ మూడింటికి సంబంధించిన కంటెంట్​ ముందుగా చూడొచ్చు.

ఇంట్లోనే కొవిడ్​ టెస్ట్

ఒమిక్రాన్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో జలుబు, దగ్గు ఉన్నా కూడా కరోనా సోకిందేమోనన్న అనుమానం వస్తుంది. ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకొనేందుకు కొన్ని యాప్స్, టెస్ట్​ కిట్స్​ ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​​ రీసెర్చ్(ఐసిఎంఆర్​) అనుమతి పొందిన హోమ్​ టెస్ట్​ కిట్స్, యాప్స్​​ సాయంతో కరోనా టెస్ట్​ చేసుకుని, రిజల్ట్ తెలుసుకోవచ్చు. ఈ యాప్స్​ని  గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్​ యాప్​ స్టోర్​ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు. హోమ్​ టెస్టింగ్​ మొబైల్​ యాప్స్​లో కరోనా టెస్ట్​ ఎలా చేసుకోవాలనే సమాచారంతో పాటు   కరోనా టెస్ట్​ రిజల్ట్ కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్స్​లో టెస్ట్​ రిజల్ట్​ని ఎలా అప్​లోడ్ చేయాలంటే... మొబైల్​ యాప్​లో కరోనా టెస్ట్ చేయించుకున్న తర్వాత టెస్ట్​ స్ట్రిప్​ని ఫొటో తీయాలి. ఫొటోలు తీసేందుకు యాప్స్​ని డౌన్​లోడ్ చేసిన మొబైల్​ ఫోన్​నే  వాడాలి. ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ యాప్స్​ ఐసిఎంఆర్​ కొవిడ్​–19 టెస్టింగ్​ పోర్టల్​కి కనెక్ట్​ అయి ఉంటాయి. అక్కడే యూజర్ల డేటా స్టోర్​ అవుతుంది. యూజర్ల డేటా సేఫ్​గా ఉంటుంది. యాప్​లో రిజిస్టర్​ అయ్యేటప్పుడు పేరు, పుట్టిన తేదీ, వయసు, అడ్రస్, మొబైల్​ నెంబర్, వ్యాక్సిన్​ తీసుకున్నారా? లేదా? ఆధార్​ కార్డ్ నెంబర్ వంటి వివరాలు యాప్​లో అప్​లోడ్​ చేయాలి. యాప్​ని బట్టి వివరాలు మారతాయి. 

హోమ్​ టెస్టింగ్​ కిట్స్​లో కొన్ని...

‘మైల్యాబ్​ డిస్కవరీ కొవిసెల్ఫ్’, పాన్​ బయో కోవిడ్​–19 యాంటీజెన్​ ర్యాపిడ్ టెస్ట్​ డివైజ్​, కొవిఫైండ్​ కొవిడ్​–19 ర్యాపిడ్​ ఎజె సెల్ఫ్​ టెస్ట్, అంగ్​కార్డ్ కొవిడ్​–19 హోమ్​ టెస్ట్ కిట్​, క్లినిక్​ టెస్ట్ కోవిడ్​–19 యాంటీజెన్​ సెల్ఫ్​టెస్ట్​, అల్ట్రా కొవి–క్యాచ్ సార్స్–కొవి–2 హోమ్​ టెస్ట్​, ఎబిచెక్​ ర్యాపిడ్ యాంటీజెన్​ సెల్ఫ్​ టెస్ట్ (నాజల్​). 

గూగుల్​ క్రోమ్​లో ఫొటో రీసైజ్​  

యూనివర్సిటీ ఎంట్రన్స్​ కోసం, జాబ్​ కోసం అప్లై చేసేటప్పుడు పాస్​పోర్ట్​ సైజ్​​ఫొటోతో పాటు సిగ్నేచర్​ని ఫలానా ఫార్మాట్​లో, ఫలానా సైజులో  అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఫొటో, సిగ్నేచర్​ని రీ–సైజ్​ చేయాల్సి వస్తుంది. గూగుల్​ క్రోమ్​ ఫొటో రీ–సైజ్​ ఫీచర్​ ​ తీసుకొచ్చింది. అంతేకాదు ఇంటర్నెట్​ లేకున్నా కూడా ఈ ఫీచర్​ని వాడుకునే ఫెసిలిటీ కల్పిస్తోంది. 

రీసైజ్​ ఇలా చేయాలి

గూగుల క్రోమ్ బ్రౌజర్​ ఓపెన్​ చేసి, సెర్చింగ్​లో క్రోమ్​ వెబ్​స్టోర్​లోకి వెళ్లాలి. తర్వాత రీసైజింగ్​ యాప్​పై క్లిక్​ చేయాలి. వెబ్​పేజ్​ ఓపెన్​ అయిన తర్వాత ‘‘యాడ్​ టు క్రోమ్” అనే పెద్ద  బ్లూ ట్యాబ్​ కనిపిస్తుంది. దాన్ని క్లిక్​ చేస్తే ‘‘యాడ్​ ఎక్స్​టెన్షన్​’ అని విండో అలర్ట్ వస్తుంది. దానిపై క్లిక్​ చేస్తే వెబ్ బ్రౌజర్​లో ఎక్స్​టెన్షన్​ ఇన్​స్టాల్​ అవుతుంది. కుడివైపు పైన కనిపించే జిగ్​సా పజిల్​ ఐకాన్​ మీద క్లిక్​ చేసి, ‘రీసైజింగ్​ యాప్​’ని సెలక్ట్​ చేసుకోవాలి. తర్వాత రీసైజ్​ చేయాల్సిన ఫొటోని అప్​లోడ్​ చేయాలి.  రీసైజింగ్ ఆప్షన్స్​ సాయంతో ఫొటోని అవసరమైన సైజ్​కి మార్చి, ‘సేవ్​ ఇమేజ్​’ని సెలక్ట్​ చేస్తే, ఫొటో డౌన్​లోడ్​ అవుతుంది. క్రోమ్​ డౌన్​లోడ్​ ఫోల్డర్​లో డీఫాల్ట్​గా  ఉంటుంది.