Jio బంపరాఫర్ : 4జీ ప్లాన్ తీసుకుంటే. 5జీ అన్ లిమిటెడ్ డేటా

Jio బంపరాఫర్ : 4జీ ప్లాన్ తీసుకుంటే. 5జీ అన్ లిమిటెడ్ డేటా

రిలయన్స్ జియో, ఎయిటెల్ వరుసగా రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచాయి. గత వారం రోజులుగా పెరిగిన టారీఫ్ రీఛార్జ్ ప్లాన్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ప్లాన్ ధరల కంటే రెటింపు చేశాయి. దీంతో మొబైల్ యూజర్లు ప్రత్యామ్నయ మార్గాలు వెతుక్కుంటున్నారు. అంతేకాదు 5జీ యూజర్లకు ఇస్తున్న అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ఆప్షన్ కూడా తొలగించింది. అయితే ఇప్పుడు 5జీ జియో యూజర్లకు కొన్ని కొత్త ప్యాక్స్ తీసుకొంది కంపెనీ. 4G డేటాపై ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP)తో అన్ లిమిటెడ్ 5G డేటాను అందించే 'ట్రూ 5G అన్‌లిమిటెడ్ ప్లాన్స్' అనే కొత్త కేటగిరీని ఇప్పుడు ప్రవేశపెట్టారు. 

ప్రస్తుతం రోజుకు 1GB లేదా 1.5GB ప్లాన్ లేదా ఏదైనా 'వాల్యూ' ప్లాన్‌ని ఉపయోగిస్తున్న Jio యూజర్లు అన్ లిమిటెడ్ 5G డేటాను యాక్సెస్ చేయడానికి వారి ప్రస్తుత యాక్టివ్ ప్లాన్‌లపై ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.

ట్రూ 5G అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్: 

రూ.51 ప్లాన్‌: ఈ ప్లాన్ ధర రూ. 51 మరియు బేస్ యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటు అయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3GB 4G డేటాతో పాటు అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు. 

రూ.101ప్లాన్‌: ఈ ప్లాన్ ధర రూ. 101 మరియు బేస్ యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటు అయ్యే వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 6GB 4G డేటాతో పాటు అపరిమిత 5G డేటాను పొందుతారు.

 రూ.151 ప్లాన్‌: ఈ ప్లాన్ ధర రూ. 151 మరియు బేస్ యాక్టివ్ ప్లాన్ గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 9GB 4G డేటాతో పాటు అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు.