మటన్ అంటే చాలా మంది లొట్టలేసుకుంటారు. మటన్ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామందికి మటన్ తినడం మంచిదేనా .. కాదా.. అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మటన్ తినడం మంచిది కాదని, రెడ్ మీట్ ఆరోగ్యానికి హానికరమని చెబుతారు. అయితే ఈ రెండు వాదనలలో ఏది కరెక్ట్.. మటన్ తినడం మంచిదేనా అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మటన్ పౌష్టికాహారం మటన్ తినడం ఆరోగ్యానికి మంచిదే.. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రం మటన్ తినడం మంచిది కాదు. మటన్ లో చాలా పోషకాలు ఉంటాయి .అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషక విలువలు ఉన్న పౌష్టిక ఆహారంగా మటన్ ను తినవచ్చని ఆరోగ్య నిపుణేలు చెబుతున్నారు.
మటన్ లో ఉండే పోషకాలివే ...
మటన్ లో బి 1, బి 2, బి 3, ,బీ6,బీ 12 విటమిన్ లు ఉంటాయి . విటమిన్ ఈ, విటమిన్ కె, సహజమైన ఫ్యాట్స్ తో పాటు కొలెస్ట్రాల్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం , జింక్, ఫాస్ఫరస్, కాపర్, సెలీనియం, అమైనోయాసిడ్స్, ప్రోటీన్లు ,న్యూట్రియంట్లు ఉంటాయి.
మటన్ తింటే ఈ సమస్యల నుండి ఊరట
మటన్ లో ఉండే బి కాంప్లెక్స్, సెలీనియం, కొలైన్ వంటివి క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. మటన్ మనలను అధిక రక్తపోటు నుండి హార్ట్ స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు రాకుండా కాపాడుతుంది.ఇందులో ఉండే పొటాషియం అందుకు దోహదం చేస్తుంది. మటన్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. మటన్ తినడం కారణంగా ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
వీళ్ళు మటన్ తినకూడదు
కొంతమందికి మటన్ తినడం ఏమాత్రం మంచిది కాదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు మటన్ తినడం ఏ మాత్రం మంచిది కాదు. దీనివలన చెడు కొలెస్ట్రాల్ మరింత పెరగడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విపరీతంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ట్రైగ్లీజరైడ్స్ సమస్య ఉన్నవారు మటన్ తినకుండా ఉండాలి .
మటన్ మితంగానే తినాలి
మటన్ లో అధికంగా ఉండే కొవ్వు కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది .అందుకే మటన్ తినాలని భావిస్తే అతిగా తినకుండా పరిమిత మోతాదులో తింటే ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు.ముఖ్యంగా నలభై ఏళ్ళు పైబడిన వారు మటన్ మితంగా తినాలి.