దేశ ప్రజల ఆరోగ్యం సంరక్షకు కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే..ఇటీవల 70 యేళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే ఆయుష్మాన్ భారత్ వర్తించాలంటే సీనియర్ సిటిజన్లకు ఆధార్ కార్డు ఉంటే చాలు.. సీనియర్ సిటిజన్లకు ఆదాయంతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. దీంతో దాదాపు 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 4.5 కోట్ల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల ఆరోగ్య భీమా అందుతుంది. సమాజంలో బలహీన వర్గాలకు తక్కువ ధరల్లో అధునాతన వైద్య సౌకర్యాలనుఅందించడమే ఈ పథకం లక్ష్యం.
దరఖాస్తు చేయడం ఎలా
సింపుల్.. సీనియర్ సిటిజన్లను ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఉంటే చాలు..ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తు విధానం..
అధికారిక నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) వెబ్ సైట్ లేదా ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- పోర్టల్ యాక్సెస్ చేసి NHA బెనిఫిషియరీ పోర్టల్ లోకి వెళ్లాలి.
- మీ ఫోన్ నంబర్ ను నమోదు చేసి , కింద ఇవ్వబడిన క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ కావాలి. OTP వస్తుంది ఎంటర్ చేయాలి.
- Above 70 Age బ్యానర్పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీ రాష్ట్రం, జిల్లా , ఆధార్ కార్డు నంబరును ఎంటర్ చేయాలి.
- KYC : ఇందుకోసం ఆధార్ OTP నిఉపయోగించాలి. దీంతోపాటు ఇటీవల ఫొటోను అప్ లోడ్ చేయాలి
- ఆయుష్మాన్ కార్డు డౌన్ లోడ్: ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 15 నిమిషాల్లో మీకు ఆయుష్మాన్ భారత్ డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్ లోడ్ చేసుకోవాలి.
అదే ఆయుష్మాన్ భారత్ యాప్ లో అయితే..
- మొబైల్ లో ఆయుష్మాన్ భారత్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
- యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి OTP ద్వారా ధృవీకరంచాలి.
- ఆధార్ నంబర్, డిక్లరేషన్ ను సమర్పించాలి.
- దీంతోపాటు ఇటీవల ఫొటోను అప్ లోడ్ చేయాలి.
- లబ్దిదారు , కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఈ కేవైసీ పూర్తి చేయాలి.
- కార్డు డౌన్ లోడ్: రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత కార్డు డౌన్ లోడ్ ఆప్షన్ వస్తుంది .. డౌన్ లోడ్ చేసుకోవాలి.