మామిడి పండు తిన్న వెంటనే కొన్ని ఫుడ్స్ తినకూడదు. అవేంటంటే..
- మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపునొప్పి వస్తుంది. ఎసిడిటీ బారిన పడతారు. అందుకే మామిడిపండు తిన్న అరగంట తరువాతే నీళ్లు తాగాలి.
- పెరుగు, మామిడిపండును కలిపి తినొద్దు. మామిడి వల్ల వంట్లో వేడి చేస్తుంది. పెరుగు చల్లబరుస్తుంది. ఈ రెండింటిని కలిపి తింటే స్కిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టాక్సిన్స్ కూడా ఏర్పడతాయి.
- మామిడిపండు తిన్నాక, కాకరకాయ కూర తింటే వికారం, వాంతులు అవుతాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
- మామిడి పండు తిని వెంటనే కూల్డ్రింక్స్ తాగితే బాడీలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.