సింగరేణి అధికారుల సంఘం ఎన్నికల విజేతలు వీరే

కోల్​బెల్ట్, వెలుగు: కోల్​మైన్స్​ఆఫీసర్స్ ​అసోసియేషన్ ​ఆఫ్​ ఇండియా(సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచి అధికారుల సంఘం ఎన్నికల్లో మందమర్రి ఏరియా అధ్యక్షుడిగా కేకే ఓసీపీ డిప్యూటీ మేనేజర్​ సట్కూరి రమేశ్, జైపూర్​ఎస్టీపీపీ ఏరియా అధ్యక్షుడిగా డిప్యూటీ ఎస్ఈ(ఈఎం) సముద్రాల శ్రీనివాస్, శ్రీరాంపూర్​ఏరియా అధ్యక్షుడిగా క్వాలిటీ విభాగం అడిషనల్​ మేనేజర్​ కె.వెంకటేశ్వర్​ రెడ్డి విజయం సాధించారు.

బెల్లంపల్లి ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఖైరిగూడ ఓసీపీ అడిషనల్​మేనేజర్ మధుసూదన్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి మందమర్రి, జైపూర్ ఎస్టీపీపీ, శ్రీరాంపూర్​ఏరియాల్లో వేర్వేరుగా ఎన్నికల కౌటింగ్ ​నిర్వహించారు. మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్లుగా ఆర్కేపీ ఓసీపీ డీవైజీఎం చిప్ప వెంకటేశ్వర్లు, శాంతిఖని సీనియర్ అండర్​ మేనేజర్​ నాగవర్దన్, జాయింట్​ సెక్రటరీలుగా ఏరియా వర్క్​షాప్ ​డిప్యూటీ సూపరింటెండెంట్​రాయబారపు నరేశ్, డిప్యూటీ మేనేజర్(ఐటీ) కొట్టె రవి, జాయింట్​ ట్రెజరర్​గా శాంతిఖని సీనియర్​అండర్ మేనేజర్​ మామిడిపల్లి సంతోష్​ ​గెలుపొందారు.

జైపూర్​ఎస్టీపీపీ ఏరియా వైస్​ ప్రెసిడెంట్లుగా ఎస్​ఈలు(ఈఎం) పి.అప్పారావు, జి.శివప్రసాద్, సెక్రటరీగా డీజీఎం కె.సంతోశ్​కుమార్, జాయింట్​ సెక్రటరీలు డీవైఎస్ఈ బి.శ్రీనాథ్, ఈఈ జి.రమేశ్, ట్రెజరర్ గా వై.రమేశ్, జాయింట్​ ట్రెజరర్ గా ఠాకూర్​ మోహన్​సింగ్​విజయం సాధించారు.