ఈసారి ఎన్నికల్లో 78 మంది మహిళలు లోక్ సభకు ఎన్నికయ్యారు. వీరిలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలు. మరికొంత మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారు. అలా కాకుండా తొలిసారిగా లోక్ సభకు ఎన్నికైన ఈ ఐదుగురికి ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు. పాలిటిక్స్ కు పూర్తిగా కొత్త వారు. రాజకీయంగా అనేక రకాల వేధింపులను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థులు విష ప్రచారం చేసినా తట్టుకుని నిలబడ్డారు. ధైర్యంతోనే అన్నింటినీ ఎదుర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో లోక్ సభకు ఎన్నికయ్యారు.
నుస్రత్ జుహాన్ ( పశ్చిమ బెంగాల్ )
సిన్మా నుంచి పాలిటిక్స్‌కు…
బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నుస్రత్ జహాన్ లోక్ సభ కు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ టికెట్ పై బసీర్ హాట్ సీటు నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు. బీజేపీ కేండిడేట్ సయతన్ బోస్ పై మూడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. నుస్రత్ గెలిచిన బసీర్ హాట్ సీటు 24 పరగణాల జిల్లాలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇద్రిస్ అలీ 2014 ఎన్నికల్లో ఈ సీటు నుంచి గెలిచారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఇద్రిస్ అలీ ఇష్టం చూపకపోవడంతో నుస్రత్ ను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సెలెక్ట్ చేశారు.
మోడలింగ్ నుంచి సినీ కెరీర్ వైపు…
మోడల్ గా నుస్రత్ కెరీర్ మొదలైంది.2010లో మిస్ కోల్‌కతగా ఆమె ఎంపికయ్యారు. మోడలింగ్ నుంచి సినిమాల వైపు అడుగు వేశారు. 2011లో బెంగాలీ దర్శకుడు రాజ్ చక్రబర్తి దర్శకత్వంలో వచ్చిన ‘శత్రు’ సినిమాతో హీరోయిన్‌గా ఆమె పరిచయం అయ్యారు. సిన్మా ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ ను నడిపారు. ఆ తర్వాత పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు. బెంగాల్ లో మమతా బెనర్జీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తాను పాలిటిక్స్ లోకి రావాలని డిసైడ్ అయినట్లు నుస్రత్ చెప్పారు. విభజన రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు.సాటి మనుషులను ప్రేమించడమే తనకు తెలుసునన్నారు ఈ అందాల తార కమ్ పొలిటీషియన్. మేనెల ఎండల్లో ప్రచారం చేయడం కష్టంగానే ఉన్నా, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను తాను టచ్ చేశానన్నారు. నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మహిళలు తనకు అండగా నిలిచినందుకు నుస్రత్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఆడవారు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడాల్సిన టైం వచ్చిందన్నారు. తాజాగా ఆమె వార్తలోకెక్కారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ ముందు ఆమె మోడ్రన్ డ్రస్సులు వేసుకుని ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ సందర్భంగా ఆమె వేసుకున్న డ్రస్సుపై విమర్శలు వచ్చాయి. దీనికి బదులిస్తూ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా తన పనితీరునే చూస్తారని, తాను వేసుకున్న డ్రస్సులను కాదని నుస్రత్ అన్నారు.
సునీతా దుగ్గల్ ( హర్యానా)
మొన్నటి దాకా ఉద్యోగం…
ఈసారి ఎన్నికల్లో హర్యానా నుంచి లోక్ సభ కు ఎన్నికైన ఒకే ఒక్క మహిళా ఎంపీ సునీతా దుగ్గల్. సిర్సా నుంచి బీజేపీ టికెట్ పై ఆమె పోటీ చేసి గెలిచారు. సునీత బ్యూరోక్రాట్ల కుటుంబం నుంచి వచ్చారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పెద్ద ఉద్యోగం చేస్తున్న సునీత 2014 లోనే పాలిటిక్స్ లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఎక్కువ మంది ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం రాజకీయరంగమే అన్నారు ఆమె.
సవాళ్లను ఎదుర్కొంటాం..
మగవారితో పోలిస్తే మహిళా రాజకీయవేత్తలే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితులు సమాజంలో ఉన్నాయన్నారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని పాలిటిక్స్ లో ముందుకు వెళతానని సునీత అన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికే తాను టాప్ ప్రయారిటీ ఇస్తానన్నారు. ఓ ఉన్నతాధికారిగా పనిచేసిన అనుభవం ఎంపీగా తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు సునీత చెప్పారు. నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇస్తానని ఆమె అన్నారు.
రమ్యా హరిదాస్ ( కేరళ)
పాటలే ఆమె ఆయుధం
రమ్యా హరిదాస్ కేరళకు చెం దిన దళిత ఎంపీ.జనం సమస్యలపై పాటలు పాడుతూ అదే లోకంగా బతికారు. తల్లి రాధ మహిళా కాంగ్రెస్ లో చురుకైన కార్యకర్త. తండ్రి రోజువారీ కూలీ. మ్యూ జిక్ గ్రాడ్యు యేట్ అయిన రమ్యా హరిదాస్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాం ధీ డిస్కవరీ. 2011 లో బ్లాక్ ప్రెసిడెం ట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రమ్య. బ్లాక్ ప్రెసిడెం ట్ అయిన ఎనిమిదేళ్లకే లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఆమెకు దొరికిం ది. అళత్తూర్ నియోజకవర్గం నుం చి లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్ ) కేం డిడేట్, సీనియర్ పార్లమెంటేరి యన్ పీకే బిజూపై పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కేరళ నుం చి లోక్ సభకు ఎన్ని కైన ఒకే ఒక్క మహిళా ఎంపీగా రమ్య రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాదు కేరళ నుం చి 48 ఏళ్ల తర్వాత లోక్ సభకు ఎన్ని కైన తొలి దళిత ఎంపీగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. రమ్య పేదరికంలో పుట్టి పెరిగారు. బలహీనవర్గాలకు ప్రభుత్వం కట్టించి ఇచ్చిన సాదా సీదా ఇంట్లోనే ఇప్పటికీ ఉంటున్నారు. యూత్ కాంగ్రెస్ నేషనల్ కో ఆర్డినేటర్ స్థాయికి అలాగే లోక్ సభకు ఎన్ని కకావడం వెనుక తల్లి రాధ ప్రోత్సాహాన్ని మరువలేనన్నారు ఆమె.
పాటలతో ఓటర్లను ఆకట్టుకున్న రమ్య...
ఎన్ని కల ప్రచారంలో తన పాటలతో ఓటర్లను రమ్య ఆకట్టుకున్నారు. ఆమె పాటలకు జనం ముగ్ధులయ్యా రు. చప్పట్లతో ఆమెను ఎంకరేజ్ చేశారు. ఎక్కడ ప్రచారం జరిగి నా ముం దు రమ్య పాటలు పాడాల్సిందే. ఆ తర్వాతే నాయకుల ఉపన్యా సాలు. జనంలో ఆమెకున్న పాపులారి టీ చూసి ఎల్డీ ఎఫ్ లీడర్లు కంగుతిన్నారు. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఏ. విజయ రాఘవన్ ఆమెపై అసభ్యకరమైన కామెం ట్స్ చేశారు. అయినా ఆమె ఇవేమీ పట్టించు కోలేదు. ప్రజలను నమ్ముకుని ముందుకెళ్లారు. ప్రజలు కూడా లక్షన్నర ఓట్ల మెజారిటీతో ఆమెను గెలిపించి లోక్ సభకు పంపారు. ఆడవారికి రాజకీయరంగంలో మరిన్ని అవకాశాలు లభించాల్సి న అవసరం ఉందన్నారు రమ్య. లోక్ సభలో మహిళల గళాన్ని తాను వినిపిస్తా నని ఆమె చెప్పారు.
ప్రమీలా బిసోయ్ ( ఒడిశా)
ఒడిశా దాటి వెళ్లని ప్రమీల
ప్రమీలా బిసోయ్ మూడో తరగతితోనే చదువు ఆపేశారు.వయసు ఆరు పదుల పైనే. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కార్యకర్తగా పనిచేస్తున్నారు. కనీసం ఎకరం భూమి కూడా లేదు. ఉండటానికి పూరి గుడిసే అధారం. జీవితంలో ఏ రోజూ ఒడిశా పొలిమేరలు దాటి వెళ్లలేదు. అలాంటి నిరుపేద మహిళ ప్రమీల ఇప్పుడు ఏకంగా లోక్ సభ కు ఎన్నికయ్యారు. బిజూ జనతాదళ్ టికెట్ పై ఆస్కా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ కేండిడేట్ అనీత శుభదర్శిని పై రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఒడిశాలో ఆస్కా సీటు చాలా కీలకమైంది. బిజూ జనతాదళ్ పార్టీకి కంచుకోట వంటిది. నవీన్ పట్నాయక్ ఇక్కడి నుంచి రెండు సార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు. నవీనే కాదు ఆయన తండ్రి బిజూ కూడా గతంలో ఇక్కడి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆస్కా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 16 సార్లు లోక్ సభ ఎన్నికలు జరగ్గా ఏడు సార్లు బిజూ జనతాదళ్ గెలిచింది. అలాంటి కీలక సీటు నుంచి నిరుపేద మహిళా రైతు ప్రమీలా బిసోయ్ పోటీ చేసి విజయం సాధించడం విశేషమే.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో …..
మౌసీగా అందరూ ఆప్యాయంగా పిలిచే ప్రమీల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో యాక్టివ్ మెంబర్. ఉమెన్ ఎంపవర్ మెంట్ కోసం ఆమె కృషి చేశారు. పేదరికంలో ఉన్న తనలాంటి ఆడవారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రమీల ఎంతగానో శ్రమించారు. అనేక సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో తానే చొరవ తీసుకుని ఆడవారిని చేర్పించారు. పొదుపుతో పాటు అనేక అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ప్రమీల చేసిన కృషికి గుర్తింపుగానే ఆమెకు టికెట్ ఇచ్చినట్లు నవీన్ పట్నాయక్ చెప్పారు. ఆస్కా నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తానని ప్రమీల చెప్పారు.
చంద్రాణి ముర్ము (ఒడిశా)
పాతికేళ్లకే లోక్ సభకు..
లోక్ సభ లో అతి తక్కువ వయసున్న ఎంపీగా రికార్డు సృష్టిం చారు చంద్రాణి ముర్ము . ఒడిశాలోని తికర్ గుమురా అనే పల్లెటూరుకు చెందిన చంద్రాణి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. చంద్రాణి బ్యాం క్ పీఓ లేదా అసిస్టెం ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఊహించని విధంగా అయితే ఆమె జీవితం మలుపు తిరిగింది. సర్కారీ ఉద్యోగం వస్తే చాలనుకున్న అడవి బిడ్డ చంద్రాణి పాతికేళ్ల వయసుకే ఏకంగా లోక్ సభకు ఎన్ని కై అందరి దృష్టిని ఆకర్షించారు. లేటెస్ట్ గా జరిగిన లోక్ సభ ఎన్ని కల్లో కియోం జహర్ నియోజకవర్గం(ఎస్టీ) నుం చి బిజూ జనతాదళ్ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు ముర్ము . బీజేపీ సీనియర్ లీడర్ అనంత నాయక్ పై 66,203 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎన్ని కల ఫలితాలు వెల్లడైన మే 23 నాటికి ఆమె వయస్సు 25 ఏళ్ల 11 నెలల 8 రోజులు. ఈ నెల 16న ఆమె 26వ బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఒడిశా సీఎం నవీన్ ఎంపిక రాజకీయాల్లో ఆడవారికి 33 శాతం రిజర్వేష న్లు అమలు చేయాలని డిసైడ్ అయిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కియోం జహర్ నియోజకవర్గం నుం చి పోటీ చేయిం చడానికి చదువుకున్న అమ్మాయి గురించి ఆరా తీస్తుంటే ఎవరో చంద్రాణి పేరు ఆయనకు చెప్పారు. దీంతో ఆమెను బిజూ జనతాదళ్ కేండిడేట్ గా డిక్లేర్ చేశారు నవీన్ పట్నాయక్. నామినేషన్ వేయగానే చంద్రాణికి వ్యతిరేకంగా ఆమె రాజకీయ ప్రత్యర్థు లు విష ప్రచారం ప్రారంభించారు. ఆమె ఇమేజ్ ను డ్యా మేజ్ చేయడానికి రకరకాలు గా ప్రయత్నిం చారు. దీంతో ఒక దశలో చంద్రాణి మానసికంగా డిస్టర్బ్ అయ్యా రు. అయినా తనను తాను మోటివేట్ చేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ నారు.ఎన్నికల యుద్ధంలో విజయం సాధించారు.