పరమశివుడికి  ఏ రాశులంటే ఇష్టమో తెలుసా..

పరమశివుడికి  ఏ రాశులంటే ఇష్టమో తెలుసా..

ప్రతి సోమవారం శివుడికి అన్ని సంప్రదాయాలతో పూజిస్తారు.అలాగే శివాలయాల్లో కోరికలు నెరవేరేందుకు రుద్రాభిషేకం కూడా చేస్తారు.ఆ రోజున భక్తులు ఉపవాసం కూడా చేస్తారు.ఇలా చేయడం వలన శివుని అనుగ్రహం ఉంటుంది అని నమ్మకం.శివుడు తన భక్తులలో ఎవరినీ నిరుత్సాహపరచనప్పటికీ, జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం 4 రాశులు ఆయనకు ఇష్టమైనవి.  ఈ రాశుల వారు శివుని ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. సిద్దాంతులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం....

పరమేశ్వరుడు భోళా శంకరుడు.. శరణంటూ వచ్చిన వారిని అనుగ్రహించి, అభయమిచ్చి, కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు. ఓం నమ: శివాయ అను పంచాక్షరి మంత్రాని జపించి, మన:స్పూర్తిగా పరమ శివున్ని ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎల్లవేళల మనకు అండగా ఉంటుంది. శివపూజకు పెద్దగా ఆర్బాటాలు అవసరం లేదు.

మేషరాశి : ఈ రాశికి అధిపతి అంగారకుడు అయినందున శివుడు ఈ రాశి వారికి  ప్రత్యేక దీవెనలు ఇస్తాడు. అంగారక గ్రహాన్ని శివునిలో భాగంగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం, అంధకాసురుడు అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు, శివుని చెమట చుక్క నేలను తాకింది. అప్పుడే అంగారకుడు ఉద్భవించాడు. ఆ సమయంలోనే శివుడు( Lord Shiva ) కోపంగా ఉన్నాడు.అందుకే సాధారణంగా ఈ రాశి వారికి కాస్త కోపం ఎక్కువుగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాని .. ఈ రాశి వారు పరమశివుడు చల్లని కృపకు పాత్రలవుతారు. వీరికి అన్నింటా విజయం లభిస్తుంది. మేషరాశి వారు మహాశివరాత్రి, మాస శివరాత్రి రోజున శివుడిని పూజించాలి. అలాగే శివునికి గంగాజలం, ఆవుపాలను నైవేద్యంగా సమర్పించాలి.ఇలా చేయడం వలన వారి వృత్తికి సహాయపడుతుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కుజుడు  అధిపతి గ్రహం.  మాస శివరాత్రి, మహా శివరాత్రికి వీరు పరమశివుడు విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు. సోమవారం ఆలయాలలో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది.

మకర రాశి : శని దేవుడు మకర రాశికి అధిపతి. .పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన భక్తులలో శని దేవుడు ఒకరు.కాబట్టి మకర రాశి వారికి శని దేవుడు, మహాదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ రాశి వారు  శివుడిని పూజించడానికి బిల్వ పత్రం, గంగా జలం, ఆవు పాలు మొదలైన వాటిని ఉపయోగించాలి. ఈ రాశి వారికి ఏ కష్టము కూడా దరిచేరనీయడు మహాశివుడు.

కుంభ రాశి : ఈ రాశికి కూడా శని దేవుడే అధిపతి. ఈ రాశి వారు కూడా శివుడు, శని దేవుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. మీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు. సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు.

పరమ శివుడు విలక్షణ దైవం. ఆయన భక్త సులభుడు. కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయనను భోళాశంకరుడు అన్నారు. ఆడంబరాలకు ఆయన దూరం. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి.. మారేడు పత్రాలతో పూజచేస్తే పరవశించి పోతాడాయన. నిరాడంబరుడైన పరమశివుని తత్త్వం మాత్రం మాహాద్భుతం. బ్రహ్మదేవుని లలాటం నుంచి జన్మించిన శివుడు లయకారకుడు.బిల్వ పత్రం, మారేడు దళం సమర్పిస్తే శివుడు ప్రసన్నం అవుతాడు. శివుడు తన భక్తులలో ఎవరినీ నిరుత్సాహపరచనప్పటికీ, జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ 4 రాశులు ఆయనకు ఇష్టమైనవి.  ఈ రాశుల వారు శివుని నుంచి  ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు.