
కడెం, వెలుగు: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన తమ పదో తరగతి మిత్రుడు చనిపోగా ఆ కుటుంబానికి వారంతా అండగా నిలిచారు. లింగాపూర్‌కు చెందిన మంద పోశెట్టి ఇటీవల చనిపోగా.. అతడితోపాటు లింగాపూర్ హైస్కూల్లో పదో తరగతి చదివిన 2000–-2001 బ్యాచ్ మిత్రులందరూ కలిసి స్నేహితుడి కుటుంబానికి రూ.25,011 ఆర్థిక సాయం చేశారు. పోశెట్టి కూతురు కావ్య, తల్లికి నగదు అందజేశారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.