హైదరాబాద్, వెలుగు: కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్లో అసోసియేషన్ మీటింగ్ జరిగింది.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ..కొన్ని కార్పొరేషన్లకు ఎండీలుగా గ్రూప్ 1 అధికారులను నియమించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై అధ్యయనానికి ఆరుగురు ఐఏఎస్ అధికారులతో అప్పటి ప్రభుత్వం కమిటీ వేసిందని ప్రభుత్వానికి గుర్తుచేశారు.