హైదరాబాద్ ధూల్ పేటలో భారీగా గంజాయి పట్టుకున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ కమలాసన్ రెడ్డి. రూ. 10 లక్షలు విలువ చేసే 54 కేజీల గంజాయిని పెట్టుకున్నామని తెలిపారు. ఆగస్టు 31నాటికి గంజాయి ఫ్రీ ధూల్ పెట్ చేస్తామని చెప్పారు. గుడుంబా నిర్ములన తర్వాత గంజాయి అమ్మకాలు ధూల్ పెట్ లో పెరిగాయని చెప్పారు. కింది స్థాయి నుండి పై వరకు 15 రోజుల నుండి ధూల్పెట్ లో తనిఖీలు చేశామని అన్నారు.
ధూల్ పెట్ లో గంజాయి నిర్ములనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పోలీసుల సహకారంతో ఇంటింటికి తనిఖీలు చేశామని వెల్లడించారు. గంజాయి ఆపరేట్ చేసే వాళ్ళు అండర్ గ్రౌండ్ కెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిపై దృష్టి పెట్టామని చెప్పారు. విశాఖపట్నం నుండి గంజాయి దిగుమతి చేస్తూ కావాల్సిన వాళ్ళకి గంజాయి సరఫరా చేస్తున్నారని అన్నారు.
సీతాఫల్ మడి, మైలారం గడ్డ, చిలకలుగుడ లో స్టాక్ పెట్టుకున్నట్టు విచారణలో తెలిసిందని చెప్పారు. ఏకకాలంలో దాడులు చేసి 54 కేజీలు పట్టుకున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ కమలాసన్ రెడ్డి.