కేంద్రం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మార్చే కుట్ర చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో మంత్రి జగదీశ్ రెడ్డి జాతీయ జండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రితో పాటు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... పోరాట యోధుల పట్ల కొందరు, గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారన్న ఆయన.. తెలంగాణ ద్రోహుల కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. 2014 కు ముందు తెలంగాణలో ఆకలి చావులు, దరిద్రాలు తప్ప అభివృద్ధి లేకుండేనన్నారు. సరైన నాయకుడు లేక ప్రజలు అరగోస పడుతుండేనని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందన్న జగదీశ్ రెడ్డి... తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.