ఓట్ల కోసమే కరువు పర్యటనలు చేస్తూ.. దొంగ డ్రామాలాడుతున్నారు : వేముల వీరేశం

ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  నరేంద్ర మోదీ, అమిత్ షా జోడి కలిసి దేశాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా వికాస్ భారత్ అంటూ అబద్దాలాడుతూ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ కేసీఆర్ ఓట్ల కోసమే కరువు పర్యటనలు చేస్తూ దొంగ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీతో కరువు రాలేదు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. కేసీఆర్ ఖాళీ గల్లా పెట్టెను మిగిల్చారని వేముల అన్నారు. బిడ్డను ఈడి వెంటాడుతుంది కొడుకును తండ్రిని ఫోన్ టాపింగ్ వేటాడుతుందని చెప్పారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని వేముల వీరేశం కోరారు.

ALSO READ :- Janaki v/s State of Kerala: గ్లామర్ బ్యూటీ నుండి జానకిగా.. అనుపమా న్యాయ పోరాటం!