తిర్యాణి, వెలుగు: తిర్యాణి మండలంలోని గుండాల, గోపెరా, గోవేనా, పునాగూడ, కొలం గూడ, గోవుర్ గూడ, మొర్రిగూడ, తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బిందెడు నీటి కోసం బోర్ దగ్గర గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. డ్రమ్ లతో వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
Also Read : గ్రీన్ హాట్ : పచ్చి మిర్చి కిలో రూ.400
సోమవారం మండలంలోని గుండాల గ్రామస్థులు నానా అవస్థలు పడ్డారు. గ్రామంలోని బోరు బావి అడుగంటి పోవడంతో వ్యవసాయ బావి నుంచి డ్రమ్ లు నింపుకొని దాహం తీర్చుకున్నారు. వానలు పడే వరకు తమ కష్టాలను తీర్చాలని అధికారులను ఆదివాసీలు కోరుతున్నారు.