
చాంద్రాయణగుట్టు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమ బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి చంపాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పాతబస్తీ ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తమని హత్య చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు అక్బరుద్దీన్. హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామే అని అక్బరుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.