- బీజేపీలో చేరుతారా? కాంగ్రెస్‌లోనా?
- నేటికీ స్పష్టత ఇవ్వని కృష్ణారావు
- తమ టికెట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆందోళన
- బీఆర్ఎస్ నేతల్లోనూ ఉత్కంఠ
నాగర్ కర్నూల్, వెలుగు: బీజేపీలోమాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్ఆశావహులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యాక జూపల్లి ఏ పార్టీలో చేరేది ప్రకటించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. చేరుతారా? కాంగ్రెస్‌లోకి వస్తారా? క్లారిటీ ఇవ్వడంలేదు. ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ తరుపున జూపల్లికి కొల్లాపూర్ టికెట్ ఖాయం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీల టికెట్లపై ఆశలు పెట్టుకున్న లీడర్లలో టెన్షన్ నెలకొన్నది. మరోవైపు మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూర్, అచ్చంపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో రూలింగ్పార్టీ గెలుపోటములను జూపల్లి ప్రభావితం చేస్తారని భావిస్తున్నారు.
ముఖ్యనేతల్లో టెన్షన్..
కాంగ్రెస్‌లో చేరిన సీనియర్సీఆర్ జగదీశ్వర్ రావు, యువలీడర్ రంగినేని అభిలాష్‌రావు పార్టీ ప్రోగ్సామ్స్‌లో స్పీడ్ పెంచారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న జగదీశ్వర్ రావు 2009లో జూపల్లి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని అసెంబ్లీకి వెళ్లాలని ఆశిస్తున్నారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరితే టికెట్చేజారుతుందని అనుచరులతో వాపోతున్నట్లు సమాచారం. టీపీసీసీ కార్యదర్శి రంగినేని అభిలాష్‌రావు ఈసారి పార్టీ టికెట్ ఆశించకుండా వేచి చూసే ధోరణితో ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ వస్తున్నారు.
హైదరాబాద్–-నంద్యాల హైవే, సోమశిల ఐకానిక్ బ్రిడ్జి సాధించేందుకు పలుమార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నారనే పేరుంది. ఇటీవలే నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్బండి సంజయ్, మధ్యప్రదేశ్ఇన్చార్జి మురళీధర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులువివేక్ వెంకటస్వామి లాంటి టాప్ లీడర్లను కొల్లాపూర్‌కు రప్పించి పలు ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఈ తరుణంలో జూపల్లి బీజేపీలో చేరితే ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కాగా జూపల్లి ఏపార్టీలోకి వెళ్లినా కొల్లాపూర్‌తో పాటు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్..
2018 ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్లోని ఒక వర్గానికి చెందిన పెద్ద తలకాయలు ఒక్కటై జూపల్లికి చెక్ పెట్టారు. ఓటమి తర్వాత హైకమాండ్ ఆయనను పూర్తిగా పక్కకు పెట్టేసింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్దన్ రెడ్డి కారెక్కిన తర్వాత జూపల్లి వర్గీయులను పట్టించుకోలేదు. అయితే లోకల్‌బాడీస్, మున్సిపల్, పీఏసీఎస్ఎలక్షన్స్లో జూపల్లి తన వర్గాన్ని బరిలోకి దింపి గెలిపించుకుని ఝలక్ ఇచ్చారు. చిన్నంబావి, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో తన వర్గీయులపై కేసులు బనాయించి వేధిస్తున్నారని పలుమార్లు ఆయన ఆరోపించారు. హోం మంత్రితో పాటు కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల లీగల్, ఇల్లీగల్ వ్యాపారాలు, దందాలు, ప్రాజెక్టుల వ్యవహారంలో ఇచ్చిపుచ్చుకోవడాలపై పూర్తి సమాచారం ఉన్న జూపల్లి ఎక్కడ ఏం బాంబు పేలుస్తాడోననే భయం బీఆర్ఎస్ లీడర్లను వెంటాడుతోంది.
20 రోజుల్లో క్లారిటీ..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనే విషయంపై మరో 20 రోజుల్లో క్లారిటీ వస్తుందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆహ్వానాలు వచ్చినా స్థానిక పరిస్థితులు, ఓట్ల పొలరైజేషన్, అవకాశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. పొంగులేటి, జూపల్లిలకు ఏపీ సీఎం జగన్ గైడెన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.