నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు : వెంకట్రామిరెడ్డి

నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు :  వెంకట్రామిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్ తనపై తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయని మెదక్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే, ఆ పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయని తెలిపారు. శనివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేయకున్నా, డబ్బులు తరలించినట్టు కట్టుకథలు అల్లారని చెప్పారు.