ఏడ దొరికిన సంతరా ఇదీ: కోడిగుడ్లు తీసుకుని.. కారులో పారిపోయారు

ఏడ దొరికిన సంతరా ఇదీ: కోడిగుడ్లు తీసుకుని.. కారులో పారిపోయారు

ఛండీఘర్: డబ్బులు కొట్టేశాడు అంటే ఓ రకం.. బంగారం దోచుకున్నాడంటే అదో రకం.. చైన్ స్నాచింగ్ అంటే అదో దోపిడీ.. కోడిగుడ్లు దోచుకుని వెళ్లటం ఏంట్రా.. అది కూడా రోడ్డు పక్కన చిరు వ్యాపారి దగ్గర కోడి గుడ్లు తీసుకుని.. వాటికి డబ్బులు చెల్లించకుండా కారులో పారిపోయారు ఈ వెధవలు.. ఆ  చిరు వ్యాపారి దగ్గర కోడిగుడ్లు దోపిడీపై సోషల్ మీడియా నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.. ఏడ దొరికిన సంతరా ఇదీ అంటూ వెటకారాలు జోడించి మరీ పిచ్చి తిట్టు తిడుతున్నారు నెటిజన్లు. ఈ కోడిగుడ్ల దోపిడీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పంజాబ్‎లోని ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన చిన్న దుకాణంలో ఓ వ్యక్తి కోడి గుడ్లు అమ్ముతున్నాడు. కారులో వచ్చిన ఓ వ్యక్తి రూ.2100 విలువ చేసే ఆరు ట్రేల కోడి గుడ్లు కొనుగోలు చేశాడు. తన దగ్గర లిక్విడ్ క్యాష్ లేదని.. ఆన్ లైన్ పేమెంట్ చేస్తానని క్యూ ఆర్ కోడ్ చూపించామని దుకాణదారున్ని అడిగాడు గుడ్లు కొన్న వ్యక్తి. దుకాణాదారుడు క్యూఆర్ కోడ్ స్టాండ్‎ను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా అంతలోనే కారుతో ఉడాయించారు గుడ్లు కొన్న వ్యక్తులు. ఈ తతంగమంతా షాప్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. లగ్జరీ కారులో వచ్చి కోడి గుడ్లు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. 

ALSO READ | వీడెవడండీ బాబూ: రైల్వే స్టేషన్లలో అమ్మాయిల జుట్టు కత్తిరిస్తున్న సైకో

కారులో వచ్చి ఛీప్‎గా చిరు వ్యాపారి దగ్గర కోడి గుడ్లు దొంగలించడమేంటిరా వెధవల్లారా అని కొందరు.. ఎవడ్రా మీరు.. ఇలా ఉన్నారా అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యి చివరకు గుడ్లు దొంగలించిన వ్యక్తలు వరకు చేరింది. దీంతో పరువు పోతుందని భావించిన బడుద్దాయిలు.. తెల్లవారి మళ్లీ దుకాణాదారుడు వద్దకు వచ్చి గుడ్ల పైసలు చెల్లించారు. రాత్రి ఆన్ లైన్ పేమెంట్ చేసినప్పటికీ ఫెయిల్ అయ్యిందని.. అది గమనించే తిరిగి ఉదయం వచ్చామని గుడ్ల దొంగలు కవరింగ్ చేసుకున్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తానికి ఎలాగైన తన డబ్బులు తనకు రావడంతో ఆ చిరు వ్యాపారి సంతోషం పడ్డాడు.