ఖమ్మంలో దారుణం జరిగింది. ఫైనాన్సర్ల వేధింపులకు యువకుడు బలయ్యాడు. టూవీలర్ ఫైనాన్స్ కట్టలేదని రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడిని పరిగెత్తించి రాళ్లతో కొట్టారు ఫైనాన్సర్లు. పరుగెత్తుతూ ప్రమాదవశాత్తు ఖానాపురం మినీ ట్యాంక్ బండ్ లో పడి వ్యక్తి చనిపోయాడు. సీసీ కెమెరాలు దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. మృతుడు రాజస్థాన్ కు చెందిన వినయ్ గా గుర్తించారు.
కొద్దిరోజుల క్రితం మోహన్ సాయి ఫైనాన్స్ మీద బైక్ ను కొనుగోలు చేశాడు వినయ్.. గత రెండుమూడునెలలుగా ఫైనాన్స్ కట్టలేదని సదరు ఫైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులు బెదిరించారు. ఇవాళ వినయ్ ఇంటికి వెళ్లిన ఫైనాన్సర్లు.. రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశారు. పారిపోతుండగా ప్రమాదవశాత్తు ఖానాపూర్ మినీ ట్యాంక్ బండ్ లో పడి చనిపోయాడు.
మోహన్ సాయి ఫైనాన్స్ సంస్థ ఆగడాలపై స్థానికులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. గత కొద్దిరోజులుగా ఫైనాన్సర్ల వేధింపులు ఎక్కువయ్యాయని చెప్తున్నారు. గతంలో ఎస్పీ రంగనాథ్ ఉన్న సమయంలో ఫైనాన్సర్ల వేధింపులకు చెక్ పెట్టాడు. ఆయన ట్రాన్సఫర్ అయ్యాక..ఫైనాన్సర్ల ఆగడాలు మితిమీరాయని స్థానికులు వాపోయారు.