
గద్వాల టౌన్, వెలుగు : పట్టణంలోని జ్యోతిబా ఫూలే గురుకులంలో చదువుకుంటున్న తమ కూతురు సుధారాణి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పేరెంట్స్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పేరెంట్స్ లాజర్, పద్మమ్మ, రాజు మాట్లాడుతూ జ్వరం వస్తుందని వారం రోజుల కింద ఫోన్ చేస్తే తాము స్కూల్కు వచ్చి తీసుకెళ్తామంటే, పంపించలేదన్నారు. తీవ్ర అస్వస్థతకు గురి కాగా, తమకు సమాచారం ఇచ్చారని వాపోయారు. టీచర్లు, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు గంజిపేట రాజు సంఘీభావం తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.