ఖమ్మం జిల్లాలో జీతాలు చెల్లించాలని ఉద్యోగుల ధర్నా

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా ప్రభుత్వం ప్రధాన హాస్పిటల్ లో ఏజెన్సీ ద్వారా పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్లు, పేషెంట్ కేర్, శానిటేషన్ ఉద్యోగులు బుధవారం ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు.  పెండింగ్ లోని మూడు నెలల జీతం చెల్లించాలని డిమాండ్​ చేశారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు స్పందించి గురువారం సాయంత్రం వరకు రెండు నెలల జీతం చెల్లిస్తానని చెప్పారు.

మిగతా నెల జీతం పది రోజుల్లో ఇస్తామని చెప్పడంతో ఉద్యోగులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ లీడర్ విష్ణు, వై.విక్రమ్, కె.శ్రీను, ఐఎఫ్ టీయూ లీడర్​ జి.రామయ్య, జంగిపల్లి విజయమ్మపాల్గొన్నారు.