గోదావరిఖని, వెలుగు : ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దత్తత తీసుకున్న జనగామ గ్రామ ప్రజలు తిప్పలు పడుతున్నారని డీసీసీ ప్రెసిడెంట్మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. కల్వర్టు, రోడ్డుకు రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. కూలిన బ్రిడ్జిని ఆయన సోమవారం పరిశీలించారు. నెలరోజుల్లో బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఏడాది కాలం దాటినా దాని గురించి పట్టించుకోలేదన్నారు.
అలాగే గోదావరిఖని నుంచి గనులకు, మంథని వైపు వెళ్లే దారిలో ఉన్న జీడికె 2ఏ మోరీ నిత్యం వరద నీటితో నిండి ఉంటున్నందున ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోరీ వద్ద నిరసన తెలిపారు. జనగామలో కూలిన బ్రిడ్జిని నిర్మించాలని, జీడీకే 2ఏ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. అనంతరం జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.