మేము బతకడమే కష్టం అని చెప్పి.. 15 రోజుల పసికందును బకెట్లో ముంచి చంపేశారు

మేము బతకడమే కష్టం అని చెప్పి.. 15 రోజుల పసికందును బకెట్లో ముంచి చంపేశారు

హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం 15 రోజుల పాప అనుమానాస్పద మృతిని ఛే దించారు పోలీసులు. ఇంకా ప్రపంచాన్ని సరిగా చూడలేని పసిగుడ్డును పొట్టనపెట్టుకున్నది ఆ పాప  తల్లిదండ్రులేనని తేల్చారు. అది కూడా అత్యంత దారుణంగా.. మానవత్వాన్ని మరిచి.. కడుపులో పుట్టిన బిడ్డను బకెట్ లో ముంచి ఊపిరి తీసినట్లు నిర్ధారించారు. ఆ కసాయి తల్లిండ్రులు సరిగా ఏడవడం కూడా రాని ఆ పసికందును.. ముంచింది నీళ్లలో అని తెలియని 15 రోజుల పాపను అమానుషంగాచంపేశారు. పాప ఆక్రందనలు వినకుండా నీళ్లలోనే ఊపిరి, కేకలు కలిసిపోయేలా హత్య చేశారు.

హైదరాబాద్  మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ కాలనీలో 15 రోజుల పసికందు అనుమానాస్పద మృతి కేసు తెలిసిన విషయమే. ఈ కేసును 48 గంటల్లో  పోలీసులు చేదించారు. పసికందు తల్లి విజ్జి పాపను బకెట్లో ముంచి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా పాప నీళ్లలో మునిగి చనిపోయినట్లుగా తేలిందని ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు.

Also Read : వామ్మో.. అనుమానానికే ఇంత దారుణమా..? 

తమిళనాడుకు చెందిన మణి, విజ్జి భార్యాభర్తలు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వీరికి 15 రోజుల క్రితం పాప జన్మించింది. పాపను పోషించలేమని అమానవీయంగా చంపేశారు.

 పసికందు తండ్రి, తన భర్త మణికి రెండు కిడ్నీలు పాడయ్యాయని విజ్జి విచారణలో భాగంగా తెలిపింది. ఇంటి పోషణ భారంగా మారడంతోనే తన పాపను తన చేతులతోనే చంపేసినట్లు ఒప్పుకుంది.  దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు.