కరీంనగర్ జిల్లాలో ఓ పార్టీ ఇంటికి వెయ్యి, క్వార్టర్ పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతున్నా ఎవరూ నిఘా బృందాలకు, పోలీసులకు చిక్కలేదు.
ఖమ్మం జిల్లాలో రెండు పార్టీల అభ్యర్థులు ఓటర్లకు రూ.500 పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కూసుమంచి మండలం కేశవాపురం సమీపంలోని దేవునితండా దగ్గర ఓ కారులో రూ.కోటి నగదు పట్టుబడింది. నాయకన్ గూడెం చెక్ పోస్టు దగ్గర వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు చేజ్ చేశారు. తప్పించుకునే యత్నంలో కారు పల్టీ కొట్టింది.
బెలూన్లు ఓపెన్ కాగా కారులో ఉన్న ఇద్దరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ కేసులో ముదిగొండ మండలం లక్ష్మీపురానికి చెందిన పాల్వంచ రాజేశ్, డ్రైవర్ సైదయ్యలపై కేసు నమోదు చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు డబ్బులను తీసుకెళ్తున్నామని నిందితులు ఒప్పుకున్నారని ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపారు.
మానుకోట, ఆసిఫాబాద్లాంటి మారుమూ జిల్లాల్లోనూ ప్రధాన పార్టీల నేతలు ఓటుకు రూ. 200 , క్వార్టర్ పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి.
వనపర్తి జిల్లా వీపనగండ్ల బీఆర్ఎస్ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఓటర్లకు పంచడానికి నిల్వ ఉంచిన రూ.87 వేల విలువగల లిక్కర్ స్వాధీనం చేసుకున్నామని ఎస్సై నందీకర్ తెలిపారు.