ఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది.. అమెరికా ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ట్రంప్

ఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది.. అమెరికా ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదన్న ట్రంప్

భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్న ఆర్థిక సాయం నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా దగ్గరచాలా డబ్బుంది. ప్రపంచంలో ఎక్కువ పన్నులు వేసే దేశాలలో ఇండియా కూడా ఒకటి. మేమెందుకు ఆ దేవానికి 21 మిలియన్ డాలర్లు చెల్లించాలి. వాళ్లు మాపై అత్యధిక పన్నులు వేస్తున్నారు కాబట్టి మేము కూడా వేస్తాం’’ అని బుధవారం ఫ్లోరిడాలోని తన నివాసంలో మీడియా సమావేశంలో అన్నారు. 

అదే విధంగా భారత ప్రధాని మోడీపై తనకు అపార గౌరవం ఉందన్నారు. ‘‘మోడీపై చాలా గౌరవం ఉంది. అలాగని 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలా..?’’ అని ప్రశ్నించారు. 

ఎలాన్ మస్క్ అధ్యక్షతన ఏర్పడిన డోజ్ ( DOGE) ఇటీవలే విదేశాలకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భారత్ కూడా ఆర్థిక సాయం పొందుతోంది. భారత్ లో ఎన్నికల శాతం పెంచేందుకు యూఎస్ 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం గతంలో చేసింది. నిధుల నిలిపివేతపై ట్రంప్ కూడా కరాఖండిగా ఫండ్స్ నిలిపివేస్తు్న్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 

విచారణ జరిపించాలంటున్న కాంగ్రెస్, బీజేపీ:

భారత్ లో ఎన్నికల వ్యవహారంలో విదేశీ సంస్థల జ్యోక్యంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ఎన్నికల సందర్భంలో నిధులు అందించి ఎన్నికలను ప్రభావితం చేయడంపై విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది. USAID మిషన్ లో భాగంగా 2021లో వీణా రెడ్డి ఇండియాకు వచ్చారని, 2024 లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే తిరిగి యూఎస్ వెళ్లారని, ఆమెను విచారణ సంస్థలు ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ అన్నారు.

Also Read:-ట్రంప్ రెసిప్రోకల్ తారిఫ్స్.. ఇండియాలో నష్టపోయే రంగాలు ఇవే..

 అదేవిధంగా, ఎన్నికల కోసం యూఎస్ నిధులు వెచ్చించడం వలన భారత ఎన్నికలను ప్రభావితం చేసినట్లైతే విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సింది మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.