ప్రజా చైతన్యంతో దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా మారాయి

ప్రజా చైతన్యంతో దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా మారాయి

ఒకప్పుడు ఆ ఊర్లు అభివృద్ధికి దూరంగా ఉండేవి. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. కానీ, గ్రామంలోని కొంత మంది...ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడవి దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా మారాయి. పాలమూరు జిల్లాలోని బెస్ట్ విలెజేస్ పై స్పెషల్ స్టోరీ. పాలమూరు జిల్లాలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.  గ్రామస్తుల్లో వచ్చిన చైతన్యం..ఊర్లల్లో మార్పులు తీసుకురావడమే కాకుండా దేశం మొత్తం తమవైపు చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు గుట్టల మధ్య రాళ్లతో నిండి ఉన్న వనపర్తి జిల్లాలోని చందాపూర్, గుండ్లపొట్లపల్లి, మంథన్ గోడ్ గ్రామాలు ఇప్పడు పచ్చదనానికి మారు పేరుగా నిలిచాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందాయి. ప్రజల  సమిష్టి సహకారంతో  గ్రామాల  రూపురేఖలు మారిపోయాయి.

వనపర్తి జిల్లాలోని చందాపూర్ గ్రామంలో గతంలో మురికి కాల్వలు సరిగ్గా లేక, చెత్త చెదారాలతో నిండి ఉండేది. అయితే ఊరిలోని కొంతమంది..ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి  మెల్లమెల్లగా అభివృద్ధి పనులు మొదలు పెట్టారు.  గ్రామ పంచాయతీ నిధులతో పాటు .దాతలు, ఊరందరి సహకారంతో చందాపూర్ ను  మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దారు. ఏళ్ల కిందట పాతిన కరెంట్ స్తంభాలను కూల్చి కొత్త వాటిని పాతారు. రోడ్లను వెడల్పు చేశారు. డ్రైనేజీలు నిర్మించుకున్నారు. గ్రామంలో నిర్మించిన రైతు వేదిక అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రామాంలో ఉన్న కొండలను పగులగొట్టకుండా వాటిపై కలర్స్ తో బొమ్మలు వేసి..అందరినీ ఆకట్టుకునేలా చేశారు. అన్ని రకాల పండ్ల చెట్లు, పూల చెట్లతో పల్లె ప్రకృతి వనం పచ్చదనంతో కళకళలాడుతోంది. అభివృద్ధిలో దూసుకుపోతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామానికి కేంద్రం ప్రభుత్వం అందించే ఛైల్డ్ ప్రెండ్లీ పురస్కారం దక్కింది.

మహబూబ్ నగర్ జిల్లా గుండ్లపొట్లపల్లికి దీన్ దయాల్ ఉపాధ్యాయ సశక్తీరణ్ పురస్కారం దక్కింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామ పంచాయతీకి నానాజీ దేశ్ ముఖ్ గౌరవ గ్రామ సభ అవార్డు వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తీరణ్ పురస్కారం దక్కింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామపంచాయతీకి నానాజీ దేశ్ ముఖ్ గౌరవ గ్రామసభ పురస్కారం వరించింది. గ్రామాల్లో కొన్నేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తమకు అవార్డులు దక్కేలా చేశాయంటున్నారు సర్పంచ్ లు. ప్రజలందరి సహాకారం వల్లే అభివృద్ధి గ్రామాలను అభివృద్ధి చేయగిలాగమంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు.