మీకు ఐపీఎల్ ట్రోఫీ కావాలి.. RCBపై కుల్దీప్ యాదవ్ సెటైర్లు

మీకు ఐపీఎల్ ట్రోఫీ కావాలి.. RCBపై కుల్దీప్ యాదవ్ సెటైర్లు

ఐపిఎల్ టైటిల్‌ అనేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. సీజన్లు గడుస్తున్నా.. కొత్త కొత్త ఆటగాళ్లు జట్టులో చేరుతున్నా.. టైటిల్ గెలవాలనే వారి కల.. కలగానే మిగిలిపోతోంది. ఈ సారైనా ఆ కోరిక నెరువేరుతుందేమో చూడాలి. ఇదిలావుంటే, ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ గెలవని ఆర్‌సీబీపై భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సెటైర్లు వేశారు.

ఈ లెప్టార్మ్ స్పిన్నర్ ఇటీవల టాక్ ఫుట్‌బాల్ HDకి చెందిన జీషన్ ఖాన్‌తో కలిసి YouTube లైవ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆ లైవ్ సెషన్‌లో ఓ ఆర్ సీబీ అభిమాని.. కుల్దీప్‌ను తమ జట్టులో చేరమని అభ్యర్థించాడు. బెంగుళూరు ఫుట్‌బాల్ జట్టులో గోల్ కీపర్‌ పోస్ట్ ఖాళీగా ఉందని.. అందువల్ల జట్టులో చేరమని కోరాడు. అందుకు భారత స్పిన్నర్.. సదరు అభిమానికి సరైన పంచ్ ఇచ్చారు. "మీకు కావాల్సింది గోల్ కీపర్‌ కాదు.. ఐపీఎల్ ట్రోఫీ అని చమత్కరించాడు.." ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

కుల్దీప్ - అభిమాని మధ్య సంభాషణ

అభిమాని: కుల్దీప్ భాయ్, RCB మై ఆ జావో, ఏక్ గోల్ కీపర్ కీ జరూరత్ హై..

కుల్దీప్: తుమ్హే గోల్ కీపర్ కి జరూరత్ నహీ, తుమ్హే ట్రోఫీ కి జరూరత్ హై భాయ్..

ప్రస్తుతం కుల్దీప్ ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఇతన్ని IPL 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 13.25 కోట్లకు రిటైన్ చేసుకుంది.

ALSO READ | Limansa Thilakarathna: అండర్ -19 టీ20 ప్రపంచకప్‌.. ఇరగదీస్తున్న దిల్షాన్ కూతురు